News January 8, 2025
కరీంనగర్: సంక్రాంతికి ప్రత్యేక బస్సులు

సంక్రాంతి పండుగ సందర్భంగా KNR రీజియన్‌లో మంగళవారం నుంచి 1,740 ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు ఆర్టీసీ ఆర్‌ఎం రాజు తెలిపారు. JBS నుంచి KNRకు 770, తిరుగుప్రయాణంలో KNR నుంచి JBSకు ఈనెల 16 నుంచి 22 వరకు 970 బస్సులను నడవనున్నట్లు చెప్పారు. ఏపీలోని వివిధ ప్రాంతాలకు ప్రస్తుతం నడుస్తున్న సర్వీసులకు అదనంగా ప్రత్యేక బస్సులను HYD మీదుగా నడపనుననట్లు తెలిపారు.
Similar News
News July 6, 2025
KNR: ‘జూనియర్ కళాశాలల్లో నమోదు పెంచాలి’

కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాళ్లతో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి శనివారం సమావేశం ఏర్పాటు చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థుల నమోదు శాతం పెంచాలని, కాలేజీలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని అన్నారు. ప్రభుత్వ వసతి గృహాల్లో జూనియర్ కాలేజీ విద్యార్థుల వసతి అంశాన్ని పరిశీలిస్తామని అన్నారు.
News July 6, 2025
కరీంనగర్ డీఈఓకు ఎస్జీటీయూ వినతి

DEO శ్రీరామ్ మొండయ్యకు ఈరోజు SGTU జిల్లా శాఖ పక్షాన పలు విద్యా సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. త్వరలో జరగనున్న సర్దుబాటు ప్రక్రియలో SGT ఉపాధ్యాయులను PS, UPS లకే కేటాయించాలని, హై స్కూల్స్‌కు కేటాయించవద్దని కోరారు. మల్కాపూర్ PSలో తీవ్ర టీచర్ల కోరత ఉందన్నారు. ప్రతి పాఠశాలకు కనీసం ఇద్దరు ఉపాధ్యాయులు ఉండేలా చూడాలని, బడిబాటలో విద్యార్థుల సంఖ్య పెరిగిన పాఠశాలలకు ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
News July 6, 2025
వీణవంక: గిన్నిస్ రికార్డు సాధించిన చిన్నారులకు కేంద్రమంత్రి సన్మానం

వీణవంక మండలానికి చెందిన బత్తిని నరేష్ కుమార్తె బత్తిని సహశ్రీ, వేముల సరివిక, కాసర్ల లాస్య గతేడాది హైదరాబాద్‌లో ప్రదర్శించిన కూచిపూడి నృత్యానికి గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించారు. వారిని శనివారం కేంద్ర హోం సహాయ మంత్రి బండి సంజయ్, స్థానిక ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సత్కరించారు. గిన్నిస్ బుక్ రికార్డు పత్రాన్ని, మెడల్‌ను అందజేశారు. చిన్నారులను ప్రశంసించారు.