News March 9, 2025

కరీంనగర్: సీపీగా బాధ్యతలు స్వీకరించిన గౌస్ ఆలం

image

కరీంనగర్ నూతన పోలీస్ కమిషనర్‌గా గౌస్ ఆలం ఆదివారం భాద్యతలు స్వీకరించారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చేసిన పోలీసు ఉన్నతాధికారుల బదిలీల్లో భాగంగా ఆదిలాబాద్ ఎస్పీగా పనిచేసిన ఆయన కరీంనగర్ పోలీస్ కమిషనర్‌గా వచ్చారు.

Similar News

News January 24, 2026

KNR: ఆర్టీసీకి 14 రోజుల్లో రూ.46.37 కోట్ల ఆదాయం

image

సంక్రాంతి పండుగ సందర్భంగా కరీంనగర్ రీజియన్ పరిధిలో ఆర్టీసీకి భారీ ఆదాయం సమకూరింది. ఈనెల 7 నుంచి 20వ తేదీల్లో మొత్తంగా 1528 అదనపు బస్సులు నడపగా.. 14 రోజుల్లో రూ.46.37 కోట్లు ఆదాయం వచ్చింది. ఇక కరీంనగర్ రీజియన్ పరిధిలో కరీంనగర్-2 డిపోలో రూ.7.78 కోట్లతో మొదటి స్థానంలో ఉండగా మంథని డిపోలో రూ. 2.43 కోట్లతో చివరి స్థానంలో ఉంది.

News January 23, 2026

KNR: నిరుద్యోగ మైనార్టీలకు ఉచిత శిక్షణ

image

తెలంగాణ మైనార్టీ కార్పొరేషన్ ద్వారా నిరుద్యోగ అభ్యర్థులకు ఫైర్ & సేఫ్టీ, వెబ్ & గ్రాఫిక్ డిజైనింగ్ ఉచిత శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తానమని దరఖాస్తులు చేసుకోవలని జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి అనిల్ కుమార్ తెలిపారు. 18-35 ఏళ్ల లోపు వయస్సు ఉండి, ఇంటర్ ఆపై చదివిన వారు అర్హులు. దరఖాస్తులను పిబ్రవరి 9 వరకు జిల్లా మైనార్టీ ఆఫీసులో సమర్పించాలని సూచించారు.

News January 22, 2026

కరీంనగర్ నూతన కలెక్టరేట్ ప్రారంభం ఎప్పుడో ?

image

KNR నూతన కలెక్టరేట్ ప్రారంభం మరోసారి ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. సంక్రాంతికి సీఎం చేతుల మీదుగా ప్రారంభం కావాల్సినా కొన్ని కారణాల వల్ల వాయిదా వేశారు. ఇప్పటికే 90 శాతం పనులు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో అద్దె భవనాలు ఖాళీ చేయాలని, వివిధ శాఖల్లో అందుబాటులో ఉన్న భవనాల వివరాలు ఇవ్వాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో నూతన కలెక్టరేట్ ప్రారంభం మరింత వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి.