News February 2, 2025
కరీంనగర్ స్పోర్ట్స్ మీట్.. ఖోఖోలో సిరిసిల్ల థర్డ్ ప్రైజ్

కరీంనగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన మూడో పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ పోటీల్లో రాజన్న సిరిసిల్ల జోన్ ఖోఖో విభాగంలో మూడో బహుమతి గెలుచుకుంది. తృతీయ బహుమతి పొందిన టీం కెప్టెన్ అల్లం రమేష్(ట్రాఫిక్ ఎస్ఐ) టీం సభ్యులను రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, జిల్లా పోలీసు అధికారులు సిబ్బంది అభినందించారు.
Similar News
News December 5, 2025
పాక్ తొలి CDFగా ఆసిమ్ మునీర్ నియామకం

పాకిస్థాన్ ఫీల్డ్ మార్షల్గా ఉన్న ఆసిమ్ మునీర్ను ఆ దేశ తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్(CDF)గా నియమిస్తూ అధ్యక్ష కార్యాలయం ప్రకటన జారీ చేసింది. ఆర్మీ స్టాఫ్ చీఫ్ పదవితో పాటు CDFగానూ ఐదేళ్ల పాటు కొనసాగుతారని చెప్పింది. అలాగే ఎయిర్ చీఫ్ మార్షల్ జహీర్ అహ్మద్ బాబర్ పదవీ కాలాన్ని రెండేళ్లు పొడిగించింది. వీరిద్దరికి అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ శుభాకాంక్షలు తెలిపినట్లు అధ్యక్ష కార్యాలయం పేర్కొంది.
News December 5, 2025
అజయ్ కుమార్ సుగంధ్ బెయిల్ పిటిషన్ 8కి వాయిదా

తిరుమల కల్తీ నెయ్యి కేసులో కల్తీకి ఉపయోగించిన కెమికల్స్లను సరఫరా చేసిన ఏ19 అజయ్ కుమార్ సుగంధ్ బెయిల్ పిటిషన్ గురువారం విచారణకు వచ్చింది. అతనికి బెయిల్ ఇస్తే దర్యాప్తు సరిగ్గా సాగదని ప్రాసిక్యూటర్ వాదించారు. దీంతో బెయిల్ పిటిషన్ 8వ తేదీకి నెల్లూరు ఏసీబీ కోర్టు వాయిదా వేసింది.
News December 5, 2025
RR: ఉమెన్స్ షూటింగ్ బాల్ ఎంపికలు రేపే

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని మహిళలు, బాలికల కోసం రాష్ట్ర షూటింగ్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఖేలో ఇండియా ఉమెన్స్ ఓపెన్ టు ఆల్ షూటింగ్ బాల్ ఎంపికలను నిర్వహించనున్నారు. ఈ నెల 6వ తేదీ శనివారం ఉదయం 10 గంటలకు తాండూరు పట్టణంలోని సెంట్ మార్క్స్ స్కూల్లో ఎంపికలు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. ఆసక్తిగల క్రీడాకారిణులు తమ బోనఫైడ్, ఆధార్ కార్డుతో హాజరుకావాలని కోరారు.


