News April 2, 2024
కరీంనగర్: హత్యకు గురైన విద్యార్థి తల లభ్యం

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం జ్యోతిష్మతి కళాశాల విద్యార్థి తల లభ్యమైంది. మార్చి 1న విద్యార్థి అదృశ్యం కాగా.. 27న తల లేకుండా విద్యార్థి మొండెంతో మృతదేహం లభ్యమైంది. తల కోసం గాలించిన పోలీసులు.. ఓ బావిలో మంగళవారం గుర్తించారు. బావిలో నీరు ఖాళీ చేయించి తలను వెలికితీశారు. ఘటనా స్థలంలోనే వైద్యాధికారులతో తలకు పోస్టుమార్టం నిర్వహించారు. హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News December 13, 2025
KNR: పోలింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత: సీపీ

శంకరపట్నం మండలంలోని మోడల్ స్కూల్లో ఏర్పాటు చేసిన ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని కరీంనగర్ పోలీస్ కమిషనర్ (సీపీ) గౌస్ ఆలాం శనివారం సందర్శించారు. 144 సెక్షన్ అమలులో ఉన్నందున గుంపులుగా సంచరించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. రిటర్నింగ్ అధికారులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా తక్షణమే పోలీస్ శాఖకు సమాచారం ఇవ్వాలని ఆయన సూచించారు.
News December 13, 2025
KNR: గ్రామ పంచాయతీ ఎన్నికల విధుల కేటాయింపుల్లో గందరగోళం

రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా విధుల కేటాయింపుల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. ర్యాండమైజేషన్ ప్రక్రియలో జరిగిన తప్పిదాల కారణంగా, ఇప్పటికే ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులతో పాటు, బదిలీపై వేరే జిల్లాకు వెళ్లిన ఉద్యోగులు కూడా విధులకు హాజరు కావాలంటూ అధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఈ పరిస్థితి వల్ల ఉద్యోగుల్లో అయోమయం, ఆందోళన పెరిగింది.
News December 13, 2025
సైబర్ నేరగాళ్లపై కరీంనగర్ సీపీ ఉక్కుపాదం

టెక్నాలజీపై పట్టున్న కరీంనగర్ CP గౌస్ ఆలం ఆర్థిక నేరగాళ్లను వేటాడుతున్నారు. సైబర్ క్రైమ్ కంప్లైంట్ వచ్చిన వెంటనే కేసును చేధిస్తూ బాధితులలో భరోసా నింపుతున్నారు. ఇటీవల సంచలనం సృష్టించిన మేటా ఫండ్ కింగ్ పిన్ లోకేశ్వర్ను పట్టుకొని కటకటాల్లోకి పంపారు. కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో 2025 సంవత్సరంలో 281 సైబర్ కేసులు నమోదయ్యాయి. రూ.90,77,918 రికవరీ చేసి బాధితులకు అందించారు.


