News April 2, 2024

కరీంనగర్: హత్యకు గురైన విద్యార్థి తల లభ్యం

image

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం జ్యోతిష్మతి కళాశాల విద్యార్థి తల లభ్యమైంది. మార్చి 1న విద్యార్థి అదృశ్యం కాగా.. 27న తల లేకుండా విద్యార్థి మొండెంతో మృతదేహం లభ్యమైంది. తల కోసం గాలించిన పోలీసులు.. ఓ బావిలో మంగళవారం గుర్తించారు. బావిలో నీరు ఖాళీ చేయించి తలను వెలికితీశారు. ఘటనా స్థలంలోనే వైద్యాధికారులతో తలకు పోస్టుమార్టం నిర్వహించారు. హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News April 17, 2026

KNR: వన్యప్రాణుల సంరక్షణకు పకడ్బందీ చర్యలు

image

వన్యప్రాణుల రక్షణకు కఠిన చర్యలు చేపట్టాలని అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే అధికారులను ఆదేశించారు. KNR కలెక్టరేట్‌లో నిర్వహించిన వన్యప్రాణి సంరక్షణ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. వన్యప్రాణి సంరక్షణ చట్టం-1972ను పక్కాగా అమలు చేయాలన్నారు. అక్రమ రవాణా నిరోధానికి సరిహద్దుల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి, తనిఖీలు ముమ్మరం చేయాలని సూచించారు. అధికారుల సమన్వయంతో పని చేయాలి అన్నారు.

కరీంనగర్‌కు చేరుకున్న డీజీపీ శివధర్ రెడ్డి

image

రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి కరీంనగర్‌కు చేరుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ‘అరైవ్ – అలైవ్’ రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా రేపు నిర్వహించనున్న జిల్లా స్థాయి అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ సందర్భంగా హెల్మెట్, సీటు బెల్ట్ వినియోగం, అధిక వేగం ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పించనున్నారు. ఈ కార్యక్రమంలో సీపీ గౌస్ ఆలం, ఉన్నతాధికారులు హాజరుకానున్నారు.