News March 21, 2024

కరీంనగర్: హోటళ్లు, లాడ్జీల్లో పోలీసుల తనిఖీ

image

రానున్న ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా తీసుకునే ముందస్తు చర్యల్లో భాగంగా కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ వ్యాప్తంగా తనిఖీలు ముమ్మరం చేశామని పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతి తెలిపారు. ఇందులో భాగంగా బుధవారం రాత్రి కరీంనగర్‌లోని అన్ని హోటళ్లు, లాడ్జీల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించినట్లు చెప్పారు. అక్రమ డబ్బు, మద్యం, ఇతర వస్తువులు పంపిణీ చేసే వారిని కట్టడి చేస్తామన్నారు.

Similar News

News December 4, 2025

KNR: పంచాయతీ ఎన్నికల నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్

image

పంచాయతీ ఎన్నికల నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన ఎన్నికల సంఘం కమిషనర్ జిల్లాలలో పంచాయతీ ఎన్నికలను నిబంధన ప్రకారం నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఐ.రాణి కుముదిని అన్నారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఐ.రాణి కుముదిని కలెక్టర్లతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. తదితర అంశాల పట్ల ఎన్నికల కమిషనర్ రివ్యూ నిర్వహించారు.

News December 3, 2025

కరీంనగర్: యువకుడిపై పోలీసుల థర్డ్ డిగ్రీ..?

image

యువకుడిని రక్తం వచ్చేలా పోలీసులు విచక్షణారహితంగా కొట్టిన ఘటన కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. 24 గంటలపాటు పోలీసులు అధీనంలో ఉంచుకొని రాత్రి 9:30కు జైలుకు తరలించడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘నా కొడుకు చేసిన నేరమేంటి? ఇంతగా ఎందుకు హింసిస్తున్నారు’ అంటూ తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. దీనిపై CP జోక్యం చేసుకొని వాస్తవాలు వెల్లడించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.

News December 3, 2025

గన్నేరువరం: ‘క్రీడల్లోనూ బాలికలు ముందుండాలి’

image

బాలికలు చదువుతో పాటు క్రీడల్లోనూ ముందుండి, అత్యుత్తమ ప్రతిభ కనబరచాలని అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే పేర్కొన్నారు. స్నేహిత అవగాహన కార్యక్రమంలో భాగంగా మంగళవారం తిమ్మాపూర్ కేజీబీవీ, గన్నేరువరం పాఠశాలలను ఆమె సందర్శించారు. అన్ని రంగాల్లోనూ ప్రతిభ చూపాలని బాలికలకు సూచించారు. ఏదైనా ఇబ్బంది ఉంటే వెంటనే హెల్ప్‌లైన్ నెంబర్లకు కాల్ చేయాలని కోరారు.