News February 22, 2025
కరీంనగర్: హోమో సెక్స్‌కు అడ్డు చెప్పాడని హత్య

హోమో సెక్స్‌కు అడ్డు చెప్పడంతో హత్య చేసిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు సిద్దిపేట ఏసీపీ మధు తెలిపారు. సిద్దిపేటకు చెందిన శ్రీనుకు KNRలోని రేకుర్తి గ్రామానికి చెందిన పర్వతం రాజు(40)తో పరిచయం ఉంది. భార్య పిల్లకు దూరంగా ఉంటున్న రాజు.. బుధవారం శ్రీనుకు మద్యం తాగించి హోమో సెక్స్ చేస్తుండగా ప్రతిఘటించాడు. దీంతో తలపై కర్రతో కొట్టడంతో శ్రీను చనిపోయాడు. దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.
Similar News
News March 26, 2025
కరిగిపోతున్న మంచు.. పెను ప్రమాదంలో చైనా?

చైనా మంచినీటి వనరులైన హిమానీనదాలు వేగంగా కరిగిపోతున్నాయి. 1960 నుంచి సుమారు 7వేలకు పైగా(సుమారు 26శాతం) మంచుదిబ్బలు మాయమైపోయాయని అంచనా. దీంతో తాగునీటి విషయంలో పెను సమస్యలు తప్పవని చైనా పర్యావరణవేత్తలు ఆందోళనగా ఉన్నారు. టిబెట్, షింజియాంగ్ ప్రావిన్సుల్లో అత్యధికంగా హిమానీనదాలున్నాయి. వాటిని కాపాడేందుకు చైనా పలు మార్గాల్ని అన్వేషిస్తున్నా ఫలితం దక్కడం లేదు.
News March 26, 2025
భూపాలపల్లి: రూరల్ ఇండియా స్వచ్ఛంద సంస్థ సేవలు అభినందనీయం: ఎస్పీ

రూరల్ ఇండియా స్వచ్ఛంద సంస్థ చేస్తున్న సేవలు ప్రశంసనీయమని జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే పేర్కొన్నారు. ఈ సంస్థ వ్యవస్థాపకుడు ప్రదీప్ లోకండే బుధవారం జిల్లాలోని 19 ప్రాథమిక, ఉన్నత పాఠశాలలకు స్పోర్ట్స్ కిట్లు, పుస్తకాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ మాట్లాడుతూ.. విద్యార్థుల మానసిక వికాసంలో పుస్తకాలు, క్రీడా సామగ్రి కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు.
News March 26, 2025
కోహ్లీ గొప్ప రోల్ మోడల్: నవజ్యోత్

విరాట్ కోహ్లీ ఒక ఇన్‌స్టిట్యూషన్ లాంటివారని, ఆయన పేరు కొన్ని తరాలు నిలిచి ఉంటుందని మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ కొనియాడారు. ‘స్టార్ స్పోర్ట్స్’ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయనొక గొప్ప రోల్ మోడల్ అని, వీధుల్లోని పిల్లలు అతనిలా ఉండాలని కోరుకుంటారని పేర్కొన్నారు. యువతపై అతని ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెప్పారు. తన చరిష్మాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారని పేర్కొన్నారు.