News March 13, 2025

కరీంనగర్: హోలీ పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలి: సిపి గౌస్ ఆలం

image

శుక్రవారం జరుపుకోనున్న హోలీ పండుగను సురక్షితంగా, బాధ్యతతో జరుపుకోవాలని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం సూచించారు. బలవంతంగా ఇతరులపై రంగులు వేయవద్దని, ఘర్షణ వాతావరణంలో పండగను జరుపుకోవద్దని తెలిపారు. మద్యం సేవించి వాహనం నడపడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, కాబట్టి హోలీ పండుగను రంగుల మయంగా ఆనందకరంగా జరుపుకోవాలని అన్నారు. స్నానానికి ప్రమాదకరమైన నీటిలో దిగవద్దని తెలిపారు.

Similar News

News January 9, 2026

కరీంనగర్: ఉపకార వేతనాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

కరీంనగర్ జిల్లాలోని ప్రభుత్వ, గుర్తింపు పొందిన పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి చదువుతున్న దివ్యాంగ విద్యార్థులు ప్రిమెట్రిక్ స్కాలర్‌షిప్‌నకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా సంక్షేమ అధికారి సుగుణ తెలిపారు. సదరం సర్టిఫికెట్, కుల, ఆదాయ ధృవీకరణ పత్రాలతో ఈపాస్ వెబ్‌సైట్ ద్వారా మార్చి 31లోగా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్‌లైన్ ప్రతులను పాఠశాల ప్రధానోపాధ్యాయుల ద్వారా జిల్లా సంక్షేమ కార్యాలయంలో అందజేయాలన్నారు.

KNR: ‘​యూరియా నిల్వలు పుష్కలం..: ఆందోళన వద్దు’

image

కరీంనగర్ జిల్లాలో ఎరువుల కొరత లేదని, రైతులు ఆందోళన చెందవద్దని జిల్లా కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. గత పది రోజుల్లోనే వివిధ సొసైటీల ద్వారా 6,513 మెట్రిక్ టన్నుల యూరియాను అందుబాటులోకి తెచ్చామన్నారు. ప్రస్తుతం జిల్లాలో మరో 1,833 మెట్రిక్ టన్నుల నిల్వలు సిద్ధంగా ఉన్నాయని వివరించారు. అవసరానికి తగినట్లుగా ఎరువులను తెప్పిస్తున్నామని, రైతులు తమ అవసరానికి మించి కొనుగోలు చేసి నిల్వ చేసుకోవద్దని సూచించారు.