News April 12, 2024
కరీంనగర్: 19న బండి సంజయ్ నామినేషన్

కరీంనగర్ పార్లమెంట్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ నామినేషన్ ముహూర్తం ఖరారైంది. ఈనెల 19న కరీంనగర్‌లో నామినేషన్ వేయనున్నట్లు బండి సంజయ్ ప్రకటించారు. నామినేషన్ కార్యక్రమానికి భారీ సంఖ్యలో కార్యకర్తలు తరలిరావాలని పిలుపునిచ్చారు. కరీంనగర్ లో బీజేపీ గెలుస్తుందని సర్వేలన్నీ స్పష్టం చేస్తున్నాయన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు అబద్ధాలతో ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
Similar News
News January 24, 2026
KNR: ఆర్టీసీకి 14 రోజుల్లో రూ.46.37 కోట్ల ఆదాయం

సంక్రాంతి పండుగ సందర్భంగా కరీంనగర్ రీజియన్ పరిధిలో ఆర్టీసీకి భారీ ఆదాయం సమకూరింది. ఈనెల 7 నుంచి 20వ తేదీల్లో మొత్తంగా 1528 అదనపు బస్సులు నడపగా.. 14 రోజుల్లో రూ.46.37 కోట్లు ఆదాయం వచ్చింది. ఇక కరీంనగర్ రీజియన్ పరిధిలో కరీంనగర్-2 డిపోలో రూ.7.78 కోట్లతో మొదటి స్థానంలో ఉండగా మంథని డిపోలో రూ. 2.43 కోట్లతో చివరి స్థానంలో ఉంది.
News January 23, 2026
KNR: నిరుద్యోగ మైనార్టీలకు ఉచిత శిక్షణ

తెలంగాణ మైనార్టీ కార్పొరేషన్ ద్వారా నిరుద్యోగ అభ్యర్థులకు ఫైర్ & సేఫ్టీ, వెబ్ & గ్రాఫిక్ డిజైనింగ్ ఉచిత శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తానమని దరఖాస్తులు చేసుకోవలని జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి అనిల్ కుమార్ తెలిపారు. 18-35 ఏళ్ల లోపు వయస్సు ఉండి, ఇంటర్ ఆపై చదివిన వారు అర్హులు. దరఖాస్తులను పిబ్రవరి 9 వరకు జిల్లా మైనార్టీ ఆఫీసులో సమర్పించాలని సూచించారు.
News January 22, 2026
కరీంనగర్ నూతన కలెక్టరేట్ ప్రారంభం ఎప్పుడో ?

KNR నూతన కలెక్టరేట్ ప్రారంభం మరోసారి ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. సంక్రాంతికి సీఎం చేతుల మీదుగా ప్రారంభం కావాల్సినా కొన్ని కారణాల వల్ల వాయిదా వేశారు. ఇప్పటికే 90 శాతం పనులు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో అద్దె భవనాలు ఖాళీ చేయాలని, వివిధ శాఖల్లో అందుబాటులో ఉన్న భవనాల వివరాలు ఇవ్వాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో నూతన కలెక్టరేట్ ప్రారంభం మరింత వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి.


