News February 28, 2025

కరీంనగర్: 2019లో 59.03%.. 2025లో 70.42%

image

ఉమ్మడి KNR, MDK, NZB, ADB పట్టభద్రులు, ఉపాధ్యాయ MLC ఎన్నికల పోలింగ్ నిన్న జరగగా.. మార్చి 3న కరీంనగర్‌లో లెక్కింపు జరగనుంది. అయితే, 2019లో పట్టభద్రుల పోలింగ్ 59.03శాతం నమోదు కాగా, 2025లో 70.42 శాతం నమోదైంది. ఉపాధ్యాయ పోలింగ్ 2019లో 83.54శాతం నమోదు కాగా, 2025లో 91.90శాతం పోలింగ్ జరిగింది. 2019 ఎన్నికలతో పోలిస్తే పట్టభద్రుల పోలింగ్ 11.39శాతం, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్ 8.36 శాతం పెరిగింది.

Similar News

News March 15, 2025

NGKL: శ్రీశైలం హైవేపై వాహనాల రాకపోకలపై సర్వే.!

image

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమ్రాబాద్ మండలం శ్రీశైలం హైవేలో 7,668 కోట్లతో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం చేయనుంది. రోజుకు ఈ రోడ్డుపై సగటున 7,181 వాహనాలు రాకపోకలు సాగిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. మన్ననూరు చెక్‌పోస్ట్ వరకు 6,880, వట్వర్లపల్లి ఈగలపెంట మధ్య 7,005 వాహనాలు తిరుగుతున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ రోడ్డుపై శ్రీశైలానికి, ఏపీకి ఎన్ని వాహనాలు వెళుతున్నాయనే వివరాలను సేకరిస్తున్నారు.

News March 15, 2025

కర్నూలు జిల్లాలో 393 మంది గైర్హాజరు

image

కర్నూలు జిల్లా వ్యాప్తంగా శనివారం జరిగిన ఇంటర్మీడియట్ రెండో సంవత్సర పరీక్షకు 393 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు జిల్లా ఇంటర్ బోర్డు ప్రాంతీయ అధికారి గురువయ్య శెట్టి తెలిపారు.19,182 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 393 విద్యార్థులు హాజరు కాలేదన్నారు. జిల్లా వ్యాప్తంగా ఎలాంటి మల్ ప్రాక్టీస్ ఘటనలు చోటు చేసుకోలేదని ఆర్ఐఓ స్పష్టం చేశారు.

News March 15, 2025

HYD: ముప్పుగా మారుతున్న స్టంట్స్

image

రాజేంద్రనగర్ పరిధిలోని శివరాంపల్లి PVNR ఎక్స్‌ప్రెస్ వే పిల్లర్ నంబర్ 276 వద్ద నుంచి డైరీ ఫామ్ రూట్లో కొంతమంది మైనర్లు నాలుగు వాహనాలపై ప్రమాదకరమైన ఫీట్లు (స్టంట్స్) చేస్తున్నారు. వీరి విన్యాసాలను చూసిన ఇతర వాహనదారులు భయపడుతున్నారు. ప్రమాదాలు జరగక ముందే చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరుతున్నారు.

error: Content is protected !!