News February 19, 2025
కరీంనగర్ : 28 నుంచి LLB పరీక్షలు

శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలోని మూడు సంవత్సరాల LLB పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసినట్లు పరీక్షల నియంత్రణాధికారి శ్రీరంగ ప్రసాద్ తెలిపారు. మొదటి సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 28 నుంచి మార్చి 5 తేదీ వరకు మధ్యాహ్నం 2గంటల నుంచి 5 గంటల వరకు జరగుతాయని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు యూనివర్సిటీ వెబ్‌సైట్ చూడాలని, సంబంధిత కళాశాలలో సంప్రదించాలని సూచించారు.
Similar News
News March 28, 2025
సిరిసిల్ల: రేషన్‌షాపుల్లో సన్నబియ్యం.. అక్రమ రవాణాకు సెల్ఫ్ బ్రేక్

రాష్ట్ర ప్రభుత్వం ఉగాది నుంచి రేషన్‌షాపుల్లో సన్నబియ్యం పంపిణీ చేయనుంది. దీంతో సిరిసిల్ల జిల్లాలో 1,73,793 మంది లబ్ధిదారులకు లబ్ధి జరగనుంది. ఇది వరకు రేషన్‌షాపుల్లో దొడ్డు బియ్యం పంపిణీ చేసేవారు. దీంతో చాలామంది లబ్ధిదారులు వాటిని అమ్ముకునేందుకు మొగ్గుచూపే వారు. ఇక నుంచి సన్నబియ్యం రేషన్ షాపుల్లో పంపిణీ చేయనుండటంతో రేషన్ బియ్యం అక్రమ రవాణాకు సెల్ఫ్ బ్రేక్ పడినట్టయ్యింది.
News March 28, 2025
ఉక్రెయిన్‌లో ఎన్నికలు జరగాలి: పుతిన్

పుతిన్ చస్తేనే యుద్ధం ఆగిపోతుందన్న ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ <<15901820>>వ్యాఖ్యల<<>> నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్‌లో UNO పర్యవేక్షణలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు కావాలన్నారు. అప్పుడే ఆ దేశంలో ఎన్నికలకు వీలుంటుందని, ప్రజల విశ్వాసంతో ఏర్పడే ప్రభుత్వంతోనే చర్చలు జరపాలని అనుకుంటున్నామని చెప్పారు. దీంతో జెలెన్‌స్కీతో చర్చలకు విముఖంగా ఉన్నట్లు పరోక్ష సందేశాలిచ్చారు.
News March 28, 2025
పెద్దపల్లి: రేషన్‌షాపుల్లో సన్నబియ్యం.. అక్రమ రవాణాకు సెల్ఫ్ బ్రేక్

రాష్ట్ర ప్రభుత్వం ఉగాది నుంచి రేషన్‌షాపుల్లో సన్నబియ్యం పంపిణీ చేయనుంది. దీంతో పెద్దపల్లి జిల్లాలో 2,19,952 మంది లబ్ధిదారులకు లబ్ధి జరగనుంది. ఇది వరకు రేషన్‌షాపుల్లో దొడ్డు బియ్యం పంపిణీ చేసేవారు. దీంతో చాలామంది లబ్ధిదారులు వాటిని అమ్ముకునేందుకు మొగ్గుచూపే వారు. ఇక నుంచి సన్నబియ్యం రేషన్ షాపుల్లో పంపిణీ చేయడంతో రేషన్ బియ్యం అక్రమ రవాణాకు సెల్ఫ్ బ్రేక్ పడినట్టయ్యింది.