News September 19, 2024
కరీంనగర్: 29న లోక్ అదాలత్

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని అన్ని కోర్టుల్లో ఈ నెల 29న నేషనల్ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్టు డిస్ట్రిక్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ వెంకటేశ్ తెలిపారు. జిల్లా కోర్టు ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడారు. లోక్ అదాలత్ ద్వారా రాజీ పడదగిన క్రిమినల్, సివిల్, కుటుంబ తగాదాలకు సంబంధించిన కేసులు ఇరువర్గాల సమ్మతితో పరిష్కరించుకోవచ్చని తెలిపారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Similar News
News December 7, 2025
కరీంనగర్: ఆర్టీసీ ప్రత్యేక టూర్ ప్యాకేజీ

KNR-2 డిపో ప్రత్యేక టూర్ ప్యాకేజీ ఏర్పాటు చేసినట్లు RM శ్రీనివాస్ తెలిపారు. టూర్ ప్యాకేజీలో భద్రాచలంకు సూపర్ లగ్జరీ బస్సును ఏర్పాటు చేశామని చెప్పారు. DEC 12న KNR బస్టాండ్ నుంచి సా.8 గం.కు బయలుదేరి, DEC 13న పాపికొండలు బోటింగ్ తదుపరి అదే రోజు రాత్రి భద్రాచలం చేరుకుంటారు. DEC 14న భద్రాచలం, పర్ణశాల దర్శనం చేసుకొని తిరిగి అదే రోజు రాత్రి వరకు KNR చేరుకుంటుందన్నారు. వివరాలకు డిపోను సంప్రదించాలన్నారు.

ఎన్నికలు పూర్తయ్యే వరకు జిల్లాలో ఎన్నికల కోడ్ అమలు: కలెక్టర్

కరీంనగర్ జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు మూడు దశల్లో నిర్వహించనున్న నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేంతవరకు జిల్లా అంతటా ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉంటుందని కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. జిల్లాలో మూడో దశ ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాత మాత్రమే ఎన్నికల కోడ్ తొలగిపోతుందని ఆమె స్పష్టం చేశారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.