News May 11, 2024

కరీంనగర్: 29 ఏళ్లలోపు ఓటర్లు 23.50 శాతం

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో మొత్తం 29.78 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 14.51 లక్షల మంది పురుషులు, 15.26 లక్షల మంది మహిళలు ఉన్నారు. ఇందులో 30 ఏళ్ల లోపు యువత 7,00,201 మంది ఉన్నారు. అంటే మొత్తం ఓటర్లలో 23.50 శాతం యువతీ యువకులే. 18-19 ఏళ్లలోపు 82,100 ఓటర్లు ఉన్నారు. 20-29 ఏళ్ల లోపు 6,18,101 ఓటర్లు ఉన్నారు.

Similar News

News January 20, 2025

ఈనెల 28న కొత్తకొండ హుండీల లెక్కింపు

image

హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని కొత్తకొండలోని వీరభద్రస్వామి ఆలయ హుండీల లెక్కింపు కార్యక్రమం ఈనెల 28వ తేదీన జరుగుతుందని ఆలయ ఈవో కిషన్ రావు తెలిపారు. మంగళవారం ఉదయం 9.00 గంటలకు జరిగే ఈ లెక్కింపు కార్యక్రమంలో ఆసక్తి ఉన్న వారు పాల్గొనవచ్చన్నారు

News January 19, 2025

సిరిసిల్ల: కూతురితో గొడవ.. తల్లి ఆత్మహత్య

image

ఓ మహిళ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన వేముల నర్సవ్వ (45) ఇంట్లో కూతురితో గొడవ పడింది. దీంతో మనస్తాపం చెంది ఎదురుగా ఉన్న ఓ వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. నర్సవ్వ కుమారుడు శేఖర్ ఆదివారం ఉదయం గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహాన్ని వెలికితీశారు.

News January 19, 2025

ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు

image

జగిత్యాల జిల్లాలో సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి శనివారం రూ.2,49,539 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.1,31,444 ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.95,765, అన్నదానం రూ.22,330,వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ తెలిపారు.