News March 10, 2025
కరీంనగర్: 322 మంది విద్యార్థుల గైర్హాజరు

కరీంనగర్ జిల్లాలో నిర్వహిస్తున్న ఇంటర్ ఎగ్జామ్లో భాగంగా సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ పేపర్ 2 ప్రశాంతంగా ముగిసినట్లు సోమవారం జిల్లా విద్యాధికారులు తెలిపారు. ఇంటర్ పరీక్షలకు 15,381 మంది విద్యార్థులకు గాను 15,059 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారని పేర్కొన్నారు. పరీక్షలకు 322 మంది విద్యార్థులు హాజరు కాలేదని తెలిపారు. ప్రశాంత వాతావరణంలో ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
Similar News
News September 18, 2025
KNR: SRR కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు

KNR సిటీలోని SRR ప్రభుత్వ కళాశాలలో వివిధ కోర్సులలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి దోస్త్ 2వ విడత స్పాట్ అడ్మిషన్స్ ప్రక్రియ షెడ్యూల్ ప్రకారం నేడు, రేపు నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ కే.రామకృష్ణ తెలిపారు. కళాశాలలో వివిధ కోర్సుల్లో 57 సీట్లు ఖాళీగా ఉన్నాయన్నారు. స్పాట్ అడ్మిషన్స్ కోసం ఒరిజినల్ సర్టిఫికెట్లు, ఒక సెట్ జిరాక్స్ కాపీలతో సమయానికి హాజరుకావాలన్నారు.
News September 17, 2025
HZB: తల్లిని చూసుకుంటామని ముందుకొచ్చిన కుమారులు

హుజూరాబాద్ మండలం కనుకులగిద్దెకు చెందిన ములుగు రాజమ్మ తన ముగ్గురు కుమారులు తనను పోషించడం లేదని ఆర్డీవోకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన RDO ముగ్గురు కుమారులు ఒక్కొక్కరు నెలకు రూ.3,000 చొప్పున తల్లి పోషణ నిమిత్తం ఇవ్వాలని ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. కాగా, దీని అమలుపై జిల్లా కలెక్టర్, సంక్షేమ అధికారిణి ఆధ్వర్యంలో విచారణ జరపగా రాజమ్మ కుమారులు ఇకపై తమ తల్లిని చక్కగా చూసుకుంటామని హామీ ఇచ్చారు.
News September 17, 2025
KNR: గంటకు రూ.400 అద్దె.. ఈజీగా 4- 5 ఎకరాలకు

ఏరువాక పనులు ముమ్మరంగా కొనసాగుతుండడంతో జిల్లాలోని రైతులు పొలాల్లో మందుల పిచికారీ కోసం నూతన టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. ఇందుకోసం డ్రోన్లలను ఆశ్రయిస్తున్నారు. రూ.400 అద్దె చెల్లించి గంట వ్యవధిలో 4- 5 ఎకరాలకు సులువుగా పిచికారీ చేస్తున్నారు. దీనికి డిమాండ్ పెరగటంతో డ్రోన్లు దొరకని పరిస్థితి ఏర్పడింది. దీంతో రైతులు శంకరపట్నం, మానకొండూర్, జమ్మికుంట, PDPL జిల్లాల నుంచి వీటిని తెప్పించుకుంటున్నారు.