News September 28, 2024

కరీంనగర్: 4 వరకు DSC అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన

image

DSC 2008 అభ్యర్థుల కల ఎట్టకేలకు సాకారం కానుంది. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో బీఈడీతో డీఎస్సీ రాసి ఉద్యోగాలు రానివారు 220కి పైగా అభ్యర్థులున్నారు. అభ్యర్థుల జాబితాను రాష్ట్ర విద్యాశాఖ వెబ్‌సైట్ పొందుపరిచినట్లు DEO జనార్ధన్‌రావు పేర్కొన్నారు. ఈ జాబితాలోని అభ్యర్థులు అక్టోబర్‌ 4 వరకు జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో ఉ.10.30 గంటల నుంచి సా.5 గంటల వరకు సర్టిఫికెట్లను పరిశీలన చేసుకోవాలని సూచించారు.

Similar News

News September 29, 2024

జగిత్యాల: దసరా కానుకగా వెరైటీ లక్కీ డ్రా

image

జగిత్యాల జిల్లా భీమారం మండలంలో దసరా సందర్భంగా పలువురు యువకులు వెరైటీ లక్కీ డ్రా ఏర్పాటు చేశారు. లక్కీ డ్రాలో 12 రకాల ఆఫర్లు పెట్టారు. రూ.100తో లక్కీ డ్రా తీస్తే మొదటి బహుమతిగా 2 కిలోల మటన్, రెండో బహుమతిగా మేక తల, మూడో బహుమతి నాటుకోడి పుంజు, ఇలా.. కోడిగుడ్లు, బీరు, విస్కీ, బట్టలు అంటూ 12 రకాల ఆఫర్స్ ఏర్పాటు చేశారు. అక్టోబర్ 11న లక్కీ డ్రా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు.

News September 29, 2024

మేడారం సమ్మక్క సారలమ్మలను దర్శించుకున్న KNR మాజీ MP

image

కరీంనగర్ మాజీ ఎంపీ, ప్లానింగ్ బోర్డ్ మాజీ వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ ములుగు జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా మేడారంలోని శ్రీ సమ్మక్క సారలమ్మలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు బీఆర్ఎస్ శ్రేణులు స్వాగతం పలికారు. అనంతరం మేడారంలో అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవార్ల దీవెనలతో ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు.

News September 29, 2024

KNR: నేడు ఎలక్ట్రికల్ బస్సుల ప్రారంభం

image

నేడు (ఆదివారం) కరీంనగర్ అంబేడ్కర్ స్టేడియంలో ఉదయం 9:30 గం.లకి ఎలక్ట్రికల్ బస్సుల ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు రీజినల్ మేనేజర్ సుచరిత తెలిపారు. ఈకార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఉత్తమ్‌కుమార్ రెడ్డి, ఆర్టీసీ వైఎస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనార్ హాజరుకానున్నట్లు పేర్కొన్నారు.