News August 12, 2024

కరీంనగర్: 5,854 మంది విద్యార్థులకు రుగ్మతలు

image

కరీంనగర్ జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో రాష్ట్రీయ బాల స్వస్థ్య (ఆర్బీఎస్కే) ఆధ్వర్యంలో విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో విద్యార్థులు వివిధ కారణాలతో చిన్న వయసులోని రుగ్మతలతో బాధపడుతున్నట్లు వెల్లడైంది. మొత్తం 5,854 మంది విద్యార్థులు వివిధ వ్యాధులతో బాధపడుతున్నట్లు గుర్తించారు.

Similar News

News September 12, 2024

సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు మంచి రోజులు!

image

సిరిసిల్ల నేతన్నలకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. మరమగ్గాల పరిశ్రమకు త్వరలో పనులు రానున్నాయి. స్వశక్తి సంఘాల మహిళలకు చీరల కోసం రూ.1.30 కోట్ల చీరల ఆర్డర్లు ఇవ్వబోతున్నట్లు సీఎం ఇటీవల ప్రకటించడంతో నేతన్నల్లో ఆశలు చిగురిస్తున్నాయి. పాత బకాయిలు కూడా విడుదల అవుతుండటంతో పరిశ్రమకు మంచి రోజులు వస్తున్నాయని నేతన్నలు భావిస్తున్నారు.

News September 12, 2024

సీఎం రేవంత్ రెడ్డి ని కలిసిన పెద్దపల్లి ఎమ్మెల్యే

image

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పెద్దపల్లి నియోజకవర్గ సమస్యలపై వినతి పత్రం అందజేశారు. అనంతరం నియోజకవర్గంలో అభివృద్ధి పనులపై ముఖ్యమంత్రితో చర్చించారు. ఈ కార్యక్రమంలో ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అట్లూరి లక్ష్మణ్ కుమార్, కరీంనగర్ సుడా ఛైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి పాల్గొన్నారు.

News September 12, 2024

ధర్మపురి: డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య

image

డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన జగిత్యాల జిల్లాలో జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. ధర్మపురి మండలం దొంతాపూర్‌ గ్రామానికి చెందిన స్రవంతి డిగ్రీ చదువుతోంది. కాగా, బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తల్లి లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ధర్మపురి ఎస్ఐ మహేశ్ తెలిపారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.