News April 7, 2024
కరీంనగర్: DSC ఉచిత శిక్షణకు స్పాట్ అడ్మిషన్లు

ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన నిరుద్యోగ అభ్యర్థులకు DSCలో SGT, SAకు GS మొదటి పేపర్ ఉచిత శిక్షణ కోసం స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు బీసీ స్టడీ సర్కిల్ కరీంనగర్ డైరెక్టర్ రవి కుమార్ ప్రకటనలో తెలిపారు. పెద్దపల్లి, జగిత్యాల, కరీంనగర్ జిల్లాకు చెందిన అర్హత గల అభ్యర్థులకు ఈ నెల 8న ఉదయం 10 గంటలకు బీసీ స్టడీ సర్కిల్లో స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తామని చెప్పారు.
Similar News
News December 12, 2025
కరీంనగర్: రెండో విడత ఎన్నికలకు రంగం సిద్ధం

మొదటి విడత ఎన్నికలు పూర్తయినందున, రెండో విడత ఎన్నికల ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు. చిగురుమామిడి మండలంలోని 17, తిమ్మాపూర్లో 23, మానకొండూరులో 17, శంకరపట్నం 29, గన్నేరువరం మండలంలో 27 గ్రామపంచాయతీలకు గాను 1046 వార్డు సభ్యుల స్థానాలకు ఆదివారం పోలింగ్ జరగనుంది. శాంతియుతంగా ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.
News December 12, 2025
కరీంనగర్ జిల్లాలో ఏ పార్టీ ఎన్ని స్థానాలు గెలిచిందంటే..?

కరీంనగర్ జిల్లాలో తొలి విడత సర్పంచ్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం కనబరిచింది.
చొప్పదండి: 16 GPలకు కాంగ్రెస్ 8 , BRS 6 , ఇతరులు 2
గంగాధర:33 GPలకు కాంగ్రెస్ 9 ,BRS 3 ,BJP 9, ఇతరులు 9
కరీంనగర్ రూరల్: 14 GPలకు కాంగ్రెస్ 6 , BRS 1 , BJP 4 , ఇతరులు 2
కొత్తపల్లి: 6 GPలకు కాంగ్రెస్ 1 , BRS 2 , BJP 1 , ఇతరులు 2
రామడుగు: 23 GPలకు కాంగ్రెస్ 9 , BRS 4 , BJP 5 , ఇతరులు 4
News December 12, 2025
కరీంనగర్ జిల్లాలో FINAL పోలింగ్ శాతం

కరీంనగర్ జిల్లాలో 5 మండలాల్లోని 92 పంచాయతీల్లో గురువారం మొదటి విడత ఎన్నికలు జరిగాయి. కాగా మధ్యాహ్నం ఒంటి గంటకు పోలింగ్ ముగియగా సమయానికి కేంద్రంలోపలికి వచ్చి క్యూలైన్లో నిలబడిన వారందరికీ ఓటేసేందుకు అధికారులు అవకాశం కల్పించారు. దీంతో జిల్లాలో ఫైనల్గా 81.82 శాతం పోలింగ్ నమోదైందని అధికారులు ప్రకటించారు.


