News December 15, 2024

కరీంనగర్: GET READY.. నేడే గ్రూప్-2 పరీక్ష

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గ్రూప్-2 పరీక్షకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
* జగిత్యాల జిల్లాలో 35 కేంద్రాల్లో-10,907
* పెద్దపల్లి జిల్లాలో 18 కేంద్రాల్లో- 9,018
* కరీంనగర్ 56 కేంద్రాల్లో 26,977
* సిరిసిల్ల 26 కేంద్రాల్లో 7,163 మంది అభ్యర్థులు నేడు పరీక్ష రాయనున్నారు. సెకన్ ఆలస్యమైన అనుమతించమని అధికారులు తెలిపారు.
ALL THE BEST

Similar News

News December 27, 2025

KNR: ముదిరాజ్ సర్పంచ్ల సన్మాన పోస్టర్ ఆవిష్కరణ

image

ఈ నెల 30న హైదరాబాద్‌ రవీంద్రభారతిలో నిర్వహించనున్న ముదిరాజ్ సర్పంచ్ల సన్మాన కార్యక్రమ పోస్టర్‌ను కరీంనగర్‌లో శనివారం ఆవిష్కరించారు. మన ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షుడు సిద్ధి సంపత్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంద నగేష్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికైన ముదిరాజ్ ప్రజాప్రతినిధులను గౌరవించుకోవడం ద్వారా రాజకీయ చైతన్యం పెంచడమే లక్ష్యమని వారు పేర్కొన్నారు.

News December 27, 2025

KNR: మహిళలపై ఎన్ని కేసులు నమోదయ్యాయో తెలుసా..?

image

కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 2025 సంవత్సరంలో మహిళలపై 567 కేసులు నమోదయ్యాయి. ఇందులో వరకట్న హత్యలు, మరణాలు, ఆత్మహత్యకు ప్రేరేపించడం, వేధింపులు, అత్యాచారం, అపహరణ, లైంగిక వేధింపులు, బహుభార్యత్వం కేసులు ఉన్నాయి. 2024లో 598 కేసులు నమోదు కాగా గత సంవత్సరం కంటే 5.18% మహిళల కేసులు తగ్గాయని సీపీ గౌస్ ఆలం తెలిపారు.

News December 27, 2025

కరీంనగర్: ప్రాపర్టీ కేసుల్లో 50% ఛేదించారు..!

image

కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో 2025 సంవత్సరంలో ప్రాపర్టీ కేసులు 505 నమోదయ్యాయి. ఇందులో 251 కేసులను పోలీసులు ఛేదించారు. 2025లో నష్టపోయిన ఆస్తి విలువ రూ. 4,11,98,269/-, ఇందులో రూ. 2,04,40,762/- విలువైన ఆస్తిని తిరిగి స్వాధీనం చేసుకొని బాధితులకు అందించారు. దీనితో రికవరీ శాతం 49.62%గా నమోదైంది. ఇది గత సంవత్సరంతో పోలిస్తే ఆస్తి రికవరీలో 24% పెరిగింది.