News February 12, 2025
కరెంట్ అమర్చడంతో ఒకరి దుర్మరణం: మందమర్రి CI

ఒకరి మృతికి కారణమైన నేరస్థుడిని అరెస్టు చేసినట్లు మందమర్రి CIశశిధర్ రెడ్డి తెలిపారు. CI వివరాల ప్రకారం.. కాసిపేట మండలం కోనూరు గ్రామానికి చెందిన రాజయ్య పెరడులో GI వైరు అమర్చి కరెంటు ఇచ్చాడు. మల్లయ్య ఈరోజు ఉదయం బర్రెను వెతుకుతుండగా GI వైరుకు తగిలి మృతి చెందాడు. మృతుడి కొడుకు శ్రీకాంత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతికి కారణమైన నేరస్థుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించామన్నారు.
Similar News
News December 6, 2025
మెదక్: చివరి రోజు 521 నామినేషన్లు

మెదక్ జిల్లాలో మూడో (చివరి)విడత ఏడు మండలాల్లో గల 183 గ్రామపంచాయతీలలో చివరి రోజు 521 నామినేషన్లు దాఖలయ్యాయి. చిలిపిచేడ్-54, కౌడిపల్లి-101, కుల్చారం-69, మాసాయిపేట-33, నర్సాపూర్-92, శివంపేట-106, వెల్దుర్తి-66 చొప్పున మూడు రోజులై కలిపి 1028 నామినేషన్ పత్రాలు సమర్పించారు. 1528 వార్డు స్థానాలకు మొత్తం 3528 నామినేషన్లు దాఖలు అయ్యాయి.
News December 6, 2025
హనుమాన్ చాలీసా భావం – 30

సాధు సంత కే తుమ రఖవారే|
అసుర నికందన రామ దులారే||
ఆంజనేయుడు సాధువులకు, సత్పురుషులకు, మంచివారికి ఎప్పుడూ రక్షకుడిగా ఉంటాడు. ఆయన రాక్షసుల సమూహాన్ని నాశనం చేసి, లోకానికి శాంతిని కలిగిస్తాడు. శ్రీరాముడికి చాలా ప్రియమైనవాడు. ఈ గుణాల కారణంగానే హనుమంతుడు అపారమైన శక్తితో, భక్తితో ఈ ప్రపంచంలో అందరిచేత పూజలందుకుంటున్నాడు. <<-se>>#HANUMANCHALISA<<>>
News December 6, 2025
జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో పోస్టులకు అప్లై చేశారా?

ముంబైలోని జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో 20 ఆక్చువేరియల్ అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు IAI/IFoA నిర్వహించే పరీక్షలో కనీసం 2 యాక్చురియల్ సబ్జెక్టులలో ఉత్తీర్ణులై ఉండాలి. 21 నుంచి 27ఏళ్ల మధ్య వయసు ఉండాలి. ఇంటర్వ్యూ/గ్రూప్ డిస్కషన్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. ఎంపికైనవారికి నెలకు రూ.40వేలు స్టైపెండ్ చెల్లిస్తారు.


