News March 28, 2024
కర్ణాటకలో నిజామాబాద్ దంపతుల ఆత్మహత్య

నిజామాబాద్ నగరానికి చెందిన దంపతులు కర్ణాటక రాష్ట్రంలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతులను గాయత్రీ నగర్ ప్రాంతానికి చెందిన మేడవరపు రాజు(55), మేడవరపు స్వాతి(53)గా పోలీసులు గుర్తించారు. వీరు కర్ణాటక రాష్ట్రంలోని కొడగు జిల్లా సోమవార్ పేట్ పరిధిలోని లాడ్జిలో సూసైడ్ చేసుకున్నారు. ఈ మేరకు నిజామాబాద్కు సమాచారం అందించారు. ఈ విషాద ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News November 11, 2025
NZB: ఘనంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి

కేంద్ర తొలి విద్యాశాఖ మంత్రి అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలను జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయాల సమావేశ మందిరంలో ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి, ఇతర జిల్లా అధికారులు మౌలానా అబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆయన దేశానికి అందించిన సేవలను వక్తలు గుర్తు చేసుకున్నారు.
News November 11, 2025
NZB: DDలో పట్టుబడితే రూ.10వేల జరిమానా: ట్రాఫిక్ CI

నూతన మోటార్ వెహికల్ చట్టం ప్రకారం మొదటిసారి డ్రంక్ అండ్ డ్రైవ్ (DD)లో పట్టుబడితే రూ.10 వేల జరిమానాతోపాటు 6 నెలల వరకు జైలు శిక్ష ఉంటుందని NZB ట్రాఫిక్ CI పబ్బ ప్రసాద్ తెలిపారు. రెండోసారి పట్టుబడితే రూ.15 వేల జరిమానా లేదా ఆరు నెలల జైలు లేదా రెండింటినీ విధించే అవకాశం ఉంటుందన్నారు. వాహనదారులు రోడ్డు భద్రత నిబంధనలను పాటించాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలను నడపరాదని ఆయన హెచ్చరించారు.
News November 11, 2025
ధాన్యం సేకరణలో అగ్రస్థానంలో నిజామాబాద్

వానాకాలం-2025 సీజన్కు సంబంధించి ధాన్యం సేకరణలో నిజామాబాద్ జిల్లా రాష్ట్రంలోనే అగ్రగామిగా ఉందని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి వెల్లడించారు. సోమవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వరి ధాన్యం సేకరణ, పత్తి, మొక్కజొన్న కొనుగోళ్లపై సమీక్ష జరిపారు.


