News January 11, 2025
కర్నూలుకు చేరుకున్న పవన్ కళ్యాణ్

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కర్నూలుకు చేరుకున్నారు. ఆయనకు అధికారులు, ప్రజాప్రతినిధులు స్వాగతం పలికారు. అనంతరం అక్కడి నుంచి పిన్నాపురం గ్రీన్ కో ప్రాజెక్టు పరిశీలనకు బయలుదేరారు. మొత్తం ప్రాజెక్టును ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించనున్నారు. కాగా పిన్నాపురం గ్రీన్ కో పవర్ ప్రాజెక్ట్ ఆసియాలోనే అతి పెద్దది.
Similar News
News October 24, 2025
ప్రమాద స్థలాన్ని పరిశీలించిన మంత్రులు

సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు కల్లూరు మండలం చిన్నటేకూరు వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాద ఘటనా స్థలాన్ని హోంమంత్రి వంగలపూడి అనిత, రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పరిశీలించారు. ఘటన జరిగిన తీరును జిల్లా పోలీసు అధికారులు మంత్రులకు వివరించారు. మంత్రులతో పాటు డీజీపీ హరీశ్, డీఐజీ ప్రవీణ్, జిల్లా కలెక్టర్ ఏ.సిరి, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్లు ఉన్నారు.
News October 24, 2025
కర్నూలు: ALL THE BEST సాదియా

పంచలింగాలలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (ఉర్దూ) చెందిన విద్యార్థిని రాష్ట్రస్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల హెచ్ఎం వెంకటేశ్వర్లు గురువారం తెలిపారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈనెల 24 నుంచి 26 వరకు జరగబోయే 69వ రాష్ట్రస్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో పాఠశాల చెందిన సాదియా తబస్సుమ్ 48 కేజీల వెయిట్ కేటగిరిలో పాల్గొంటున్నట్లు వ్యాయామ ఉపాధ్యాయుడు మాలిక్ తెలిపారు.
News October 24, 2025
తాగునీటి ఎద్దడి నివారణకు కార్యాచరణ రూపొందించండి: కలెక్టర్

జిల్లాలోని అన్ని మైనర్ ఇరిగేషన్ ట్యాంకులు, సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులను నీటితో నింపే చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి అధికారులను ఆదేశించారు. గురువారం కర్నూలు కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాలులో ఇరిగేషన్, ఆర్డబ్ల్యూఎస్, హెచ్ఎన్ఎస్ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. వేసవిలో నీటి ఎద్దడి నివారణకు కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించారు.


