News January 7, 2025

కర్నూలుకు నారా లోకేశ్!

image

మంత్రి నారా లోకేశ్ ఈ నెల 9న కర్నూలుకు రానున్నారు. ఉదయం నగరానికి చేరుకుని సుంకేసుల రోడ్డులో వర్చువల్ ఇంటరాక్టివ్ డిజిటల్ క్లాస్ రూమ్‌ను ప్రారంభిస్తారు. అనంతరం అనంతపురం వెళ్తారు. సాయంత్రం నగరంలో జరగనున్న ‘డాకు మహారాజ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ముఖ్యఅతిథిగా పాల్గొంటారు. రాత్రికి అనంతపురంలోనే బస చేసే అవకాశం ఉంది. 10న కర్నూలులో మంత్రి టీజీ భరత్ కూతురు వివాహ రిసెప్షన్‌కు హాజరై మంగళగిరికి పయనమవుతారు.

Similar News

News December 20, 2025

10వ ఫలితాల పెంపునకు 361 పాఠశాలలకు మెంటార్లు: కలెక్టర్

image

పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం పెంచేందుకు జిల్లాలో 361 పాఠశాలలకు 361 మంది అధికారులను మెంటార్లుగా నియమించినట్లు కలెక్టర్ ఏ.సిరి తెలిపారు. 100 రోజుల యాక్షన్ ప్లాన్‌ను పటిష్ఠంగా అమలు చేసి ఈ ఏడాది 90శాతం ఉత్తీర్ణత సాధించాలని ఆదేశించారు. డ్రాపౌట్ అయిన 1,559 మంది విద్యార్థులను తిరిగి పాఠశాలలకు తీసుకురావాలన్నారు. హాజరు, రోజువారీ పరీక్షలు, జవాబు పత్రాల పరిశీలనపై కట్టుదిట్టమైన పర్యవేక్షణ ఉండాలన్నారు.

News December 20, 2025

రహదారి ప్రమాదాల నివారణే లక్ష్యం: డీఐజీ, ఎస్పీ

image

రహదారి ప్రమాదాల నియంత్రణే లక్ష్యంగా ప్రతీ శనివారం ప్రజలకు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్, ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశించారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే ప్రమాదాలు తగ్గుతాయని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా పోలీసు స్టేషన్ పరిధుల్లో రోడ్డు భద్రత, ట్రాఫిక్ నియమాలపై సమావేశాలు నిర్వహించారు. తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు.

News December 20, 2025

కర్నూలు: మిరప పంటలో గంజాయి సాగు

image

చిప్పగిరి మండలం దేగులపాడు గ్రామ పరిధిలో మిరప పంటలో అంతర పంటగా గంజాయి సాగు చేసినట్లు పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. పొలాన్ని తనిఖీ చేసి గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. దీనిపై పూర్తిస్థాయి దర్యాప్తు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.