News October 1, 2024
కర్నూలులో కుక్కల దాడి.. 30 మందికి గాయాలు
కర్నూలులోని వన్‌టౌన్ పరిధిలో కుక్కలు దాడి చేయడంతో 30 మందికిపైగా చిన్నారులు గాయపడ్డారు. వన్‌టౌన్ పరిధిలోని బండిమెట్ట, గడ్డా వీధి, చిత్తారి వీధి, గరీబ్ నగర్ ప్రాంతాల్లో సోమవారం రాత్రి కుక్కలు దాడి చేశాయి. గాయపడిన చిన్నారులను కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధిత చిన్నారులను మంత్రి భరత్, జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా పరామర్శించారు. గాయపడిన ఒక్కో చిన్నారికి రూ.10వేల పరిహారం అందిస్తామన్నారు.
Similar News
News October 6, 2024
కర్నూలు: జాతీయస్థాయి రగ్బీ పోటీలకు లక్ష్మాపురం విద్యార్థి ఎంపిక
కర్నూలు ఆదర్శ విద్యా మందిరంలో ఈ నెల 2, 3వ తేదీల్లో రాష్ట్రస్థాయిలో జరిగిన ఎస్జీఎఫ్ అండర్-19 జాతీయ స్థాయి రగ్బీ పోటీలకు లక్ష్మాపురం గురుకులం బాలిక జ్యోతి ఎంపికైంది. ఈ మేరకు వ్యాయామ ఉపాధ్యాయురాలు లావణ్య ఆదివారం తెలిపారు. రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికవ్వడం పట్ల జ్యోతిని పాఠశాల అధ్యాపక బృందం అభినందించారు.
News October 6, 2024
నంద్యాల: టైరు పేలి గ్యాస్ సిలిండర్ల ఆటో బోల్తా
బనగానపల్లె మండలం యనకండ్ల సమీపంలో ఆదివారం ఉదయం గ్యాస్ సిలిండర్లతో వెళ్తున్న ఆటో టైర్ పేలి బోల్తా పడింది. ఈ ఘటనలో ఎవరికీ ప్రమాదం జరగలేదు. బనగానపల్లె నుంచి యనకండ్లకు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. గ్యాస్ సిలిండర్లు పేలి ఉంటే ఘోర ప్రమాదం జరిగి ఉండేదని పేర్కొన్నారు.
News October 6, 2024
చిన్న చెరువులో మృతదేహం లభ్యం
అవుకు రిజర్వాయర్ సమీపంలోని చిన్న చెరువులో శనివారం గుర్తుతెలియని మృతదేహం లభ్యమైనట్లు పోలీసులు వెల్లడించారు. జీఎన్ఎస్ఎస్ కాలువ ద్వారా నీటి ప్రవాహానికి మృతదేహం కొట్టుకొని వచ్చి ఉంటుందని భావిస్తున్నారు. మృతదేహం గుర్తుపట్టలేనంతగా కూళ్లిపోయి ఉందని తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.