News March 4, 2025
కర్నూలులో ఘోర ప్రమాదం.. రిటైర్డ్ వార్డెన్ మృతి

కర్నూలులో ఇవాళ ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. కోడుమూరు మండలం వెంకటగిరికి చెందిన రిటైర్డ్ హాస్టల్ వార్డెన్ కృష్ణారెడ్డి డీ మార్ట్ వైపు వాకింగ్‌కు వెళ్లిన సమయంలో గుర్తుతెలియని వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే మృతిచెందారు. కృష్ణారెడ్డి కోడుమూరు మండలం లద్దగిరిలో హాస్టల్ వార్డెన్‌గా పనిచేస్తూ పదవీ విరమణ పొందారు. ప్రస్తుతం కర్నూలులో నివాసం ఉంటున్నారు. ఈ ఘటనతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Similar News
News March 23, 2025
Dy.CM పవన్ కళ్యాణ్‌ని సన్మానించిన బుడగ జంగాలు

కర్నూలు జిల్లా పూడిచెర్లకి వచ్చిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కి బేడ బుడగ జంగం రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్ సన్మానించారు. క్యాబినెట్, అసెంబ్లీలో బుడగ జంగలకు ఎస్సీ హోదా కల్పించేందుకు ఆమోదం తెలిపిన కూటమి నాయకులకు, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, MP బైరెడ్డి శబరికు కృతజ్ఞతలు తెలిపారు.
News March 22, 2025
ఏప్రిల్ 5 నుంచి రాష్ట్రస్థాయి కిక్ బాక్సింగ్ పోటీలు

ఏప్రిల్ 5 నుంచి 6 వరకు కర్నూలు నగరంలో రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ విభాగాలలో కిక్ బాక్సింగ్ పోటీలను నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర కిక్ బాక్సింగ్ సంఘం కార్యదర్శి నరేంద్ర ఆచారి తెలిపారు. శనివారం నగరంలోరాష్ట్ర స్థాయి కిక్ బాక్సింగ్ పోటీలకు సంబంధించి బ్రోచర్‌ను పలువురు ఆవిష్కరించారు
News March 22, 2025
నంద్యాల జిల్లాలో దారుణ హత్య

నంద్యాల జిల్లా బండిఆత్మకూరు మండలం లింగాపురంలో శనివారం దారుణ హత్య చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నంద్యాల సుధాకర్ రెడ్డి పొలం వద్దకు వెళ్తుండగా కొత్తచెరువు దగ్గర మాటువేసిన గుర్తుతెలియని దుండగులు ఆయనను అత్యంత కిరాతకంగా నరికి చంపారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు.