News February 21, 2025
కర్నూలులో జీబీఎస్ కేసు నమోదు

కర్నూలులో తొలి గిలియన్ బార్ సిండ్రోమ్ (జీబీఎస్) కేసు నమోదైంది. నగరంలోని భగత్‌సింగ్‌నగర్‌కు చెందిన గోకారమ్మ (46) అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరగా వైద్యులు పరీక్షలు నిర్వహించారు. జీబీఎస్ ఉన్నట్లు నిర్ధరించారు. దీంతో ఆమెను ప్రత్యేక వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ వ్యాధి అంటువ్యాధి కాదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.
Similar News
News September 19, 2025
వరంగల్: లబ్ధిదారుల ఖాతాల్లో రూ.2 లక్షలు జమ..!

ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులకు డబుల్ ధమాకా వచ్చినట్టే వచ్చి వారి ఆశలపై నీళ్లు చల్లింది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా దాదాపు 20 మందికి పైగా లబ్ధిదారుల ఖాతాల్లో ఈ నెల 12, 15న రెండు సార్లు రూ.లక్ష చొప్పున జమయ్యాయి. ఒక్క జనగామలోనే 15 మంది వరకు ఉండొచ్చని హౌసింగ్ శాఖ అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1300 మంది ఖాతాల్లో ఈ విధంగా జమ కాగా వాటిని తిరిగి తీసుకోనున్నట్లు స్పష్టం చేశారు.
News September 19, 2025
VZM: రానున్న 20 రోజులు ఎరువుల సరఫరా కీలకం: కలెక్టర్

రానున్న 20 రోజులు ఎరువులు సరఫరా కీలకమని మండల వ్యవసాయాధికారులు, తహశీల్దార్లు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఎస్.రామసుందర్ రెడ్డి ఆదేశించారు. జిల్లాలో ఎరువులు లభ్యత, సరఫరాపై మండల వ్యవసాయాధికారులు, తహశీల్దార్లతో కలెక్టర్ గురువారం సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రైవేట్ ఎరువుల దుకాణాలలో తనిఖీలు నిర్వహించి వారి వద్ద ఉన్న ఎరువుల నిల్వలను తక్షణ అవసరం ఉన్న ప్రాంతాలకు సరఫరా చేయాలన్నారు.
News September 19, 2025
నేటి అసెంబ్లీ అప్‌డేట్స్

AP: నేడు ఉ.10 గం.కు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మెడికల్ కాలేజీలపై వైసీపీ వాయిదా తీర్మానం ఇవ్వనుంది. మధ్యాహ్నం బనకచర్ల, ఇరిగేషన్ ప్రాజెక్టులపై చర్చ జరగనుంది. మధ్యాహ్నం 2 గం.కు క్యాబినెట్ సమావేశమై సభలో ప్రవేశపెట్టే బిల్లులకు ఆమోదం తెలపనుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ చట్ట సవరణ ఆర్డినెన్స్‌ను ప్రవేశపెట్టనున్నారు.