News February 21, 2025

కర్నూలులో జీబీఎస్ కేసు నమోదు

image

కర్నూలులో తొలి గిలియన్‌ బార్ సిండ్రోమ్‌ (జీబీఎస్‌) కేసు నమోదైంది. నగరంలోని భగత్‌సింగ్‌నగర్‌కు చెందిన గోకారమ్మ (46) అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరగా వైద్యులు పరీక్షలు నిర్వహించారు. జీబీఎస్ ఉన్నట్లు నిర్ధరించారు. దీంతో ఆమెను ప్రత్యేక వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ వ్యాధి అంటువ్యాధి కాదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.

Similar News

News March 27, 2025

బైరెడ్డికి పదవి.. వైసీపీ శ్రేణుల హర్షం

image

వైసీపీ యువనేత బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డికి వైఎస్ జగన్ కీలక పదవి ఇవ్వడంపై ఆ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. వైసీపీ రాష్ట్ర యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించడంతో సిద్ధార్థ్ రెడ్డికి శుభాకాంక్షలు చెబుతూ జగన్ మంచి నిర్ణయం తీసుకున్నారంటూ కొనియాడుతూ పోస్టులు పెడుతున్నారు. మరోవైపు ‘నాపై నమ్మకంతో మరో బాధ్యత ఇచ్చిన జగన్ అన్నకి ప్రత్యేక ధన్యవాదాలు’ అంటూ బైరెడ్డి ట్వీట్ చేశారు.

News March 27, 2025

కర్నూలు జిల్లాలో భానుడి సెగలు.!

image

కర్నూలు జిల్లాలో గత కొద్ది రోజులుగా భానుడు విలయ తాండవం ఆడుతున్నాడు. ఏపీ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ(APSDMA) గణాంకాల ప్రకారం బుధవారం ఆలూరు మండలం కమ్మరచేడులో 40.7°C ఉష్ణోగ్రత నమోదై రాష్ట్రంలోనే జిల్లా రెండవ స్థానంలో నిలిచింది. కాగా, మార్చి నెలలోనే ఈ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

News March 27, 2025

కర్నూలులో నేడే ఎన్నికలు

image

కర్నూలు జిల్లా బార్ అసోసియేషన్ ఎన్నికలు గురువారం జరగనున్నట్లు ఎన్నికల అధికారి సీనియర్ న్యాయవాది సీ.ప్రభాకర్ రెడ్డి తెలిపారు. జిల్లా బార్ అసోసియేషన్ కార్యాలయంలో ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అధ్యక్షుడి రేసులో హరినాథ్ చౌదరి, మురళీ మోహన్, సంపత్ కుమారి, జనరల్ సెక్రటరీ రెసులో ఆంజనేయులు, కృష్ణమూర్తి, వెంకటేశ్వర్లు, జాయింట్ సెక్రటరీ రేసులో బాల సుబ్రహ్మణ్యం, నాగరాజు ఉన్నారని తెలిపారు.

error: Content is protected !!