News October 26, 2024

కర్నూలులో నిలిచిన ఉల్లి క్రయవిక్రయాలు

image

కర్నూలు మార్కెట్‌లో ఉల్లి కొనుగోళ్లు నిలిచిపోయాయి. ఇప్పటికే కొనుగోలు చేసిన సరకు బయటకు తరలించేందుకు మరో రెండ్రోజులు పట్టే అవకాశం ఉండటంతో ఈనెల 28 వరకు కొనుగోళ్లను అధికారులు నిలిపివేశారు. రైతులు మార్కెట్‌కు సరకు తీసుకురావొద్దని మార్కెట్ కమిటీ కార్యదర్శి జయలక్ష్మి సూచించారు. 24న 19,711, నిన్న 22,500 క్వింటాళ్ల ఉల్లి మార్కెట్‌కు చేసింది. నిన్నటి సరకును కొనుగోలు చేయలేదు. రైతులు నిరీక్షిస్తున్నారు.

Similar News

News November 6, 2024

ఆంగ్లో ఇండియన్స్ సమస్యల పరిష్కారానికి కృషి: మంత్రి ఫరూక్

image

రాష్ట్రంలో ఉన్న ఇండియన్స్ కుటుంబాల సంక్షేమానికి, వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి ఫరూక్ పేర్కొన్నారు. బుధవారం వెలగపూడిలోని సచివాలయంలో ఆంగ్లో ఇండియన్ వెల్ఫేర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధి బృందం మంత్రిని కలిసింది. గత ప్రభుత్వం ఆంగ్లో ఇండియన్స్ సమస్యలను విస్మరించిందని మంత్రి ఫరూక్ అన్నారు.

News November 6, 2024

కప్పట్రాళ్ల రిజర్వ్ ఫారెస్ట్‌లో యురేనియం తవ్వకాలు లేవు: ఎస్పీ

image

దేవనకొండ మండలం, కప్పట్రాళ్ల రిజర్వ్ ఫారెస్ట్ చుట్టుపక్క గ్రామాల్లో యురేనియం లభ్యత, పరిశోధన కోసం తవ్వకాలు లేవని ఎస్పీ తెలిపారు. యురేనియం తవ్వకాల గురించి వస్తోన్న వదంతులను ప్రజలు నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు.

News November 6, 2024

ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ కీలక వ్యాఖ్యలు!

image

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు MLA డా.బీవీ జయనాగేశ్వర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వంలో వ్యక్తిగత అజెండాలకు తావులేదని, మన ఐక్యతకు భంగం కలిగించే శక్తులను తరిమికొడదామని కూటమి నేతలకు పిలుపునిచ్చారు. వ్యక్తిగత స్వార్థాలు పక్కన పెట్టి, పార్టీ మార్గదర్శకాలను గౌరవిస్తూ ముందుకు సాగడం చాలా ముఖ్యమని స్పష్టం చేశారు. ప్రజలు మన నాయకత్వాన్ని, మన కృషిని నిశితంగా పరిశీలిస్తున్నారని పేర్కొన్నారు.