News March 27, 2025

కర్నూలులో నేడే ఎన్నికలు

image

కర్నూలు జిల్లా బార్ అసోసియేషన్ ఎన్నికలు గురువారం జరగనున్నట్లు ఎన్నికల అధికారి సీనియర్ న్యాయవాది సీ.ప్రభాకర్ రెడ్డి తెలిపారు. జిల్లా బార్ అసోసియేషన్ కార్యాలయంలో ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అధ్యక్షుడి రేసులో హరినాథ్ చౌదరి, మురళీ మోహన్, సంపత్ కుమారి, జనరల్ సెక్రటరీ రెసులో ఆంజనేయులు, కృష్ణమూర్తి, వెంకటేశ్వర్లు, జాయింట్ సెక్రటరీ రేసులో బాల సుబ్రహ్మణ్యం, నాగరాజు ఉన్నారని తెలిపారు.

Similar News

News December 12, 2025

కర్నూలు జిల్లా గ్రంథాలయ ఛైర్మన్‌గా నాగేంద్ర

image

తుగ్గలి గ్రామానికి చెందిన తుగ్గలి నాగేంద్రను కర్నూలు జిల్లా గ్రంధాలయ ఛైర్మన్‌గా ప్రభుత్వం నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈయన గత టీడీపీ ప్రభుత్వంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్, పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాం కుమార్‌కు నాగేంద్ర ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గ్రంథాలయాల అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.

News December 11, 2025

కర్నూలు డీఈవోగా బాధ్యతలు స్వీకరించిన సుధాకర్

image

కర్నూలు విద్యాశాఖ అధికారిగా గురువారం ఎల్.సుధాకర్ బాధితులను స్వీకరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ డాక్టర్ A.సిరిని మర్యాదపూర్వకంగా కలిశారు. డీఈవో మాట్లాడుతూ.. రానున్న పదో తరగతి పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు కలసికట్టుగా కృషి చేస్తామన్నారు. జిల్లాలో విద్యార్థుల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానన్నారు.

News December 11, 2025

ప్రజా సేవల్లో సంతృప్తి పెంచేందుకు చర్యలు: కర్నూలు కలెక్టర్

image

పెన్షన్, రేషన్, ఆసుపత్రి సేవలు, అన్నా క్యాంటీన్లు తదితర ప్రభుత్వ సేవల్లో ప్రజల సంతృప్తి పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ డా.ఏ. సిరి, సీఎస్ విజయానంద్‌కు వివరించారు. సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎస్ అధికారులను ఉద్దేశించి అవినీతి లేకుండా, లబ్ధిదారులకు మర్యాదపూర్వకంగా సేవలు అందించాలని సూచించారు. సమీక్షలో జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్‌, జిల్లా అధికారులు పాల్గొన్నారు.