News March 22, 2025
కర్నూలులో పవన్ కళ్యాణ్ పర్యటన వివరాలు ఇలా..!

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు.
☞ ఉదయ 9.45 గంటలకు కర్నూలు విమానాశ్రయానికి చేరుకుంటారు
☞ 9.50 గంటలకు రోడ్డు మార్గాన ఓర్వకల్లు మండలం పూడిచెర్లలో నీటి కుంటల తవ్వకాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరవుతారు
☞ 11.40 గంటలకు తిరిగి విమానాశ్రయం చేసుకుని బేగంపేట వెళ్తారు.
Similar News
News March 28, 2025
NGKL: ఉప్పునుంతలలో 40.0 గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదు

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో 25 ఉష్ణోగ్రత నమోదు కేంద్రాల్లో గడిచిన 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రతల వివరాలు ఇలా.. అత్యధికంగా ఉప్పునుంతలలో 40.0 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. తెలకపల్లి, వంగూర్, నాగర్ కర్నూల్ 39.9, పెద్దకొత్తపల్లి, పెంట్లవెల్లి 39.8, కోడేరు 39.7, బిజినపల్లి, చారకొండ 39.6, కొల్లాపూర్, కల్వకుర్తి 39.3, వెల్దండ 39.1, అచ్చంపేట 39.0 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
News March 28, 2025
చేవెళ్ల సబ్ రిజిస్ట్రార్కు సాహిత్య అకాడమీ అవార్డు

చేవెళ్ల సబ్ రిజిస్ట్రార్ డాక్టర్ దాసరి వెంకటరమణకు అరుదైన గౌరవం దక్కింది. 2014లో ఆయన రాసిన ఆనందం అనే కథల సంపుటిని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వరించింది. ఇదే కథల సంపుటిని షోలాపూర్కు చెందిన బుధవారం రేణుక ‘ఆనందం’ పేరుతో మరాఠీలోకి అనువాదం చేశారు. కథల సంపుటిలోని ఆనంద అనే మొదటి కథను మహారాష్ట్రలోని షోలాపూర్ విశ్వవిద్యాలయంలో బీఏ విద్యార్థులకు పాఠ్యాంశంగా ఈ ఏడాది ఎంపిక చేశారు.
News March 28, 2025
మండపేట: అధిష్ఠానంపై తోట అలిగారా..!

వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అధిష్ఠానంపై అలిగారని పార్టీ క్యాడర్లో వదంతులు చక్కెర్ల కొడుతున్నాయి. 25 ఏళ్ల సీనియర్ నాయకుడు అయిన తనను కాదని కాకినాడ జిల్లా అధ్యక్ష పదవిని రాజాకు కట్టబెట్టడంపై అగ్రహంగా ఉన్నారని గుసగసలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఉత్తరాంధ్ర కో ఆర్డీనేటర్గా కన్నబాబుని పదవి వరించింది. దీనితో తనను నిర్లక్ష్యం చేస్తుండటంతో తటస్థంగా ఉంటున్నారని సన్నిహత వర్గాల్లో చర్చనీయంశంగా మారింది.