News March 22, 2025
కర్నూలులో పవన్ కళ్యాణ్ పర్యటన వివరాలు ఇలా..!

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు.
☞ ఉదయ 9.45 గంటలకు కర్నూలు విమానాశ్రయానికి చేరుకుంటారు
☞ 9.50 గంటలకు రోడ్డు మార్గాన ఓర్వకల్లు మండలం పూడిచెర్లలో నీటి కుంటల తవ్వకాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరవుతారు
☞ 11.40 గంటలకు తిరిగి విమానాశ్రయం చేసుకుని బేగంపేట వెళ్తారు.
Similar News
News April 21, 2025
రోహిత్ శర్మ అరుదైన రికార్డు

CSKతో జరిగిన మ్యాచ్‌లో రాణించిన రోహిత్ శర్మ(76*) అరుదైన రికార్డును సాధించారు. IPLలో అత్యధిక(20) POTMలు సాధించిన భారత ప్లేయర్‌గా నిలిచారు. ఓవరాల్‌గా ఈ జాబితాలో ABD(25), గేల్(22) తొలి రెండు స్థానాల్లో, కోహ్లీ(19) ఫోర్త్ ప్లేస్‌లో ఉన్నారు. అలాగే IPLలో అత్యధిక రన్స్ చేసిన ఆటగాళ్ల జాబితాలో ధవన్(6,769)ను వెనక్కు నెట్టి 6,786 పరుగులతో హిట్ మ్యాన్ రెండో స్థానానికి చేరారు. కోహ్లీ(8,326) టాప్‌లో ఉన్నారు.
News April 21, 2025
దేశవ్యాప్త సమ్మెకు LPG డిస్ట్రిబ్యూటర్ల పిలుపు

తమ సమస్యలను 3 నెలల్లో పరిష్కరించకపోతే దేశవ్యాప్త సమ్మె చేస్తామని LPG డిస్ట్రిబ్యూటర్ల అసోసియేషన్ కేంద్రాన్ని హెచ్చరించింది. నిర్వహణ వ్యయం అధికమైనందున 14.2KG సిలిండర్‌కు ఇస్తున్న ₹73.03 కమీషన్‌ను ₹150కి పెంచాలని డిమాండ్ చేసింది. ఉజ్వల స్కీమ్‌లోని సిలిండర్ల పంపిణీలో సమస్యలున్నాయని, ఆయిల్ కంపెనీల టార్గెట్లనూ భరించలేకపోతున్నామని పేర్కొంది. ఇప్పటికే పెట్రోలియం మంత్రిత్వ శాఖకు లేఖ రాసినట్లు తెలిపింది.
News April 21, 2025
పార్వతీపురం మన్యం జిల్లాలో నేటి ఉష్ణోగ్రతలు ఇలా..

పార్వతీపురం జిల్లాలో శుక్రవారం ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని APSDM తెలిపింది. ఉదయం 10 తర్వాత బయటికొచ్చే వారంతా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. బలిజిపేట, గరుగుబిల్లి, సీతానగరం మండలాల్లో 43.7°C, కొమరాడ, పార్వతీపురం మండలాల్లో 43.4°C నమోదవుతాయని తెలిపింది. మిగిలిన అన్ని మండలాల్లో 41 డిగ్రీల పైగా ఉష్ణోగ్రత నమోదు అవుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు.