News February 15, 2025
కర్నూలులో బర్డ్ ఫ్లూ.. ‘ఆందోళన అవసరం లేదు’

కర్నూలులో బర్డ్ ఫ్లూపై ఆందోళన అవసరం లేదని పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ జి.శ్రీనివాస్ తెలిపారు. నగరంలోని నరసింహారావు పేటను రెడ్ జోన్‌గా గుర్తించి చికెన్, గుడ్ల అమ్మకాలను నిలిపివేశామని తెలిపారు. మిగిలిన ప్రాంతాల్లో చికెన్, గుడ్ల అమ్మకం కొనసాగుతుందన్నారు. చికెన్‌ను 100 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఉడికించి తింటే ఎలాంటి ప్రమాదం ఉండదని స్పష్టం చేశారు.
Similar News
News March 14, 2025
కర్నూలు జిల్లా వాసికి ఆల్ ఇండియా 199వ ర్యాంకు

స్టాఫ్ సెలక్షన్ కమిషన్, కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ లెవెల్ తుది పరీక్ష ఫలితాలలో కర్నూలు జిల్లా పెద్దకడబూరుకు చెందిన వంశీ కృష్ణారెడ్డి అనే వ్యక్తి 199వ ర్యాంకు సాధించాడు. దీంతో ఇన్కమ్ టాక్స్ ఉద్యోగానికి ఎంపికయ్యాడని తండ్రి వెంకటరెడ్డి తెలిపారు. కృష్ణారెడ్డి స్వాతంత్ర్య సమరయోధుడు కీ.శే వెంకటరెడ్డికి ముని మనవడు కావడం విశేషం. కృష్ణారెడ్డికి పలువురు అభినందనలు తెలిపారు.
News March 14, 2025
అక్రమాలకు పాల్పడకుండా పర్యవేక్షణ చేయాలి: కలెక్టర్

జిల్లాలో ప్రస్తుతం ఉన్న ప్రాజెక్టుల వివరాలతో పాటు ప్రతిపాదించిన ప్రాజెక్టులపై సమగ్ర నివేదిక ఇవ్వాలని జలవనరుల శాఖ అధికారులను కలెక్టర్ పీ.రంజిత్ బాషా ఆదేశించారు. గురువారం కర్నూలు కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాలోని నీటి పారుదల ప్రాజెక్టుల పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు. నీటి విడుదలలో అక్రమాలకు పాల్పడకుండా పర్యవేక్షణ చేయాలని అధికారులకు సూచించారు.
News March 13, 2025
కర్నూలు జిల్లా నేటి ముఖ్యాంశాలు..!

➤ మంత్రాలయంలో ఆకట్టుకున్న భారీ రంగోలి
➤ రూ.2.06 కోట్ల నిధుల వినియోగానికి పచ్చజెండా: మేయర్
➤ హౌసింగ్ లబ్ధిదారులకు అదనపు ఆర్థిక సహాయం: కలెక్టర్
➤ రేపు పత్తికొండలో టమాటా ప్రాసెసింగ్ యూనిట్ కు భూమిపూజ
➤ ఆదోని నియోజకవర్గ సమస్యలపై MLA పార్థసారథి అసెంబ్లీలో గళం
➤ వైసీపీపై అసెంబ్లీలో ఎమ్మిగనూరు ఎమ్మెల్యే ఆగ్రహం
➤ కూటమి ప్రభుత్వంపై బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి తీవ్ర విమర్శలు