News February 14, 2025

కర్నూలులో బర్డ్ ఫ్లూ తొలి కేసు.. రెడ్ జోన్‌గా ప్రకటన

image

కర్నూలులో తొలి బర్డ్ ఫ్లూ కేసు నమోదైంది. నగరంలోని నరసింహారావు పేటలో నమోదైనట్లు KMC ఆరోగ్య శాఖ అధికారులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. దీంతో నరసింహారావు పేట, పరిసర ప్రాంతాలను రెడ్ జోన్‌గా ప్రకటించినట్లు వెల్లడించారు. సంకల్ప్ బాగ్‌లో ఓ వ్యక్తి తన నివాసంలో కోడిని పెంచుకుంటున్నాడు. ఈ క్రమంలో ఉన్నట్టుండి ఆ కోడి చనిపోవడంతో పరీక్షలు చేయించాడు. పరీక్షలో బర్డ్ ఫ్లూ సోకినట్లు తేలడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

Similar News

News December 4, 2025

WGL: తొలి విడతలో 52 పంచాయతీలు ఏకగ్రీవం

image

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో తొలి విడత పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో 52 సర్పంచ్‌ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఇందులో వరంగల్‌ జిల్లాలో 10 (రాయపర్తి 5, పర్వతగిరి 3, వర్ధన్నపేట 2), ములుగు జిల్లాలో 9, మహబూబాబాద్‌ జిల్లాలో 9, భూపాలపల్లి జిల్లాలో 9, జనగామ జిల్లాలో 10 (రఘునాథపల్లి 5), హనుమకొండ జిల్లాలో 5 పంచాయతీలు ఉన్నాయి.

News December 4, 2025

వెల్దుర్తి: ఎండ్రకాయల వేటకు వెళ్లి వ్యక్తి గల్లంతు

image

వెల్దుర్తి హల్దీవాగులో ఎండ్రకాయ వేటకు వెళ్లి వ్యక్తి అదృశ్యమైన ఘటన హస్తాల్ పూర్ శివారులో చోటు చేసుకుంది. గ్రామంలోని గంగిరెద్దులాగా చెందిన జానపాటి సాయిలు, ఆవుల దుర్గయ్య అలియాస్ శంకర్ (42) గ్రామ శివారులోని హల్దీవాగుకి ఎండ్రకాయల వేటకు వెళ్లారు. ఇరువురు ఎండ్రకాయలు పట్టుకొని బయటకు వస్తుండగా, దుర్గయ్య నీటిలో ఒక్కసారిగా మునిగి పోయాడు. దీంతో ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు.

News December 4, 2025

HYD: IITల్లో నీటిని ఒడిసిపట్టే చెరువు

image

రోజు రోజుకు పెరుగుతున్న పట్టణీకరణతో వర్షపు నీటిని ఒడిసిపట్టే పరిస్థితి తగ్గుతోంది. దీంతో ఎండాకాలంలో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. ఈ విషయాన్ని గుర్తించిన IIT HYD విద్యా సంస్థ 654 ఎకరాల ప్రాంగణంలో లోలెవెల్ ఏరియాలో చెరువును అందుబాటులోకి తెచ్చింది. అక్కడ కురిసిన వర్షపు నీరు మొత్తం ఇందులోకి వచ్చి చేరుతుంది. దీని కెపాసిటీ 2.28 కోట్ల లీటర్లుగా అధికారులు తెలిపారు.