News February 15, 2025
కర్నూలులో మెడికల్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

కర్నూలు మెడికల్ కళాశాలలో విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. అందిన వివరాల మేరకు.. ఎంబీబీఎస్ రెండో సంవత్సరం చదువుతున్న రమ్యతేజ అనే విద్యార్థిని హాస్టల్లో పురుగు మందు తాగారు. గమనించిన సిబ్బంది వెంటనే ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. రమ్యతేజ అనంతపురానికి చెందిన యువతిగా తెలుస్తోంది. ఘటనకు కారణాలు తెలియాల్సి ఉంది.
Similar News
News March 14, 2025
బాలుడిని తల్లిదండ్రుల చెంతకు చేర్చిన Way2News

కర్నూలు జిల్లా గోనెగండ్లలోని గంజల్ల రోడ్డు సమీపంలో 3ఏళ్ల <<15748871>>బాలుడు<<>> సంచరిస్తుండగా కోటేశ్వరరావు అనే వ్యక్తి ఆ బాలుడిని గోనెగండ్ల పోలీసులకు అప్పగించిన విషయం తెలిసిందే. దీంతో బాలుడి సంబంధీకులు తమన సంప్రదించాలని కోరారు. ఈ విషయాన్ని Way2News ప్రచురించింది. విషయం తెలుసుకుని తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్కు చేరుకుని బాలుడిని తీసుకువెళ్లారు. తమ బిడ్డ ఆచూకీకి సహకరించిన Way2Newsకు వారు కృతజ్ఞతలు తెలిపారు.
News March 14, 2025
కర్నూలు జిల్లా వాసికి ఆల్ ఇండియా 199వ ర్యాంకు

స్టాఫ్ సెలక్షన్ కమిషన్, కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ లెవెల్ తుది పరీక్ష ఫలితాలలో కర్నూలు జిల్లా పెద్దకడబూరుకు చెందిన వంశీ కృష్ణారెడ్డి అనే వ్యక్తి 199వ ర్యాంకు సాధించాడు. దీంతో ఇన్కమ్ టాక్స్ ఉద్యోగానికి ఎంపికయ్యాడని తండ్రి వెంకటరెడ్డి తెలిపారు. కృష్ణారెడ్డి స్వాతంత్ర్య సమరయోధుడు కీ.శే వెంకటరెడ్డికి ముని మనవడు కావడం విశేషం. కృష్ణారెడ్డికి పలువురు అభినందనలు తెలిపారు.
News March 14, 2025
అక్రమాలకు పాల్పడకుండా పర్యవేక్షణ చేయాలి: కలెక్టర్

జిల్లాలో ప్రస్తుతం ఉన్న ప్రాజెక్టుల వివరాలతో పాటు ప్రతిపాదించిన ప్రాజెక్టులపై సమగ్ర నివేదిక ఇవ్వాలని జలవనరుల శాఖ అధికారులను కలెక్టర్ పీ.రంజిత్ బాషా ఆదేశించారు. గురువారం కర్నూలు కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాలోని నీటి పారుదల ప్రాజెక్టుల పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు. నీటి విడుదలలో అక్రమాలకు పాల్పడకుండా పర్యవేక్షణ చేయాలని అధికారులకు సూచించారు.