News June 24, 2024
కర్నూలులో వైసీపీ కార్యాలయం ఇదే
అక్రమ నిర్మాణమని తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయాన్ని కూల్చడంతో రాష్ట్రంలోని ఆ పార్టీ కార్యాలయాలపై చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో కర్నూలు జిల్లా వైసీపీ కార్యాలయాన్ని కూడా అనుమతులు లేకుండా నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. కర్నూలు నడిబొడ్డున అయిదురోడ్ల కూడలిలో 1.60 ఎకరాల్లో ఈ భవన నిర్మాణం జరగుతోంది. రూ.100 కోట్ల విలువైన ఈ భూమిని గతంలో ఏపీఆగ్రోస్‌కు కేటాయించగా.. దాన్ని తిరిగి తీసుకుని వైసీపీకి ఇచ్చారు.
Similar News
News November 9, 2024
నంద్యాల డీఎస్పీగా పీ.శ్రీనివాస రెడ్డి
నంద్యాల సబ్ డివిజన్ నూతన డీఎస్పీగా పీ.శ్రీనివాస రెడ్డి నియమితులయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 20 మంది డీఎస్పీలు బదిలీ కాగా, పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న ఆయనను నంద్యాల డీఎస్పీగా ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు డీజీపీ సీహెచ్ ద్వారక తిరుమలరావు ఉత్తర్వులు జారీ చేశారు.
News November 8, 2024
BREAKING: జోన్-4లో 20 మంది సీఐల బదిలీ
రాయలసీమ రేంజ్ జోన్-4 పరిధిలో 20మంది CIలను బదిలీ చేస్తూ శుక్రవారం కర్నూలు రేంజ్ DIG కోయ ప్రవీణ్ ఉత్తర్వులు జారీ చేశారు. బనగానపల్లె UPS సీఐగా కే.ప్రవీణ్ కుమార్, NDL CCS-3 సీఐగా ఎన్.కృష్ణయ్య, YMG UPS సీఐగా వీ.శ్రీనివాసులు, KNL సైబర్ క్రైమ్ సీఐగా వేణు గోపాల్, KNL CCS-2 సీఐగా మురళీధర్ రెడ్డి, ALR సీఐగా వెంకట చలపతి, KNL-1,3 టౌన్ సీఐలుగా పీ.నాగ శేఖర్, పీ.శేషయ్య, NDL సైబర్ క్రైమ్ సీఐగా జీ.మారుతి శంకర్.
News November 8, 2024
పవన్ కళ్యాణ్‌ను కలిసిన జనసేన వీర మహిళ రాజేశ్వరి
ఆదోని నుంచి మంగళగిరికి దాదాపు 487 కి.మీ మేర సైకిల్ యాత్ర చేసిన జనసేన వీర మహిళ రాజేశ్వరి ఎట్టకేలకు తన అభిమాన నేత, డిప్యూటీ CM పవన్ కళ్యాణ్‌ను కలుసుకున్నారు. మంగళగిరిలోని జనసేన ప్రధాన కార్యాలయంలో పవన్ కళ్యాణ్‌ను కలిసిన ఆమె హర్షం వ్యక్తం చేశారు. ఆమెను పవన్ కళ్యాణ్ ఘనంగా సత్కరించారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న ఆమెను అభినందించారు.