News November 18, 2024

కర్నూలులో సందడి చేసిన హాస్యనటుడు బ్రహ్మానందం

image

కర్నూలులో సోమవారం హాస్య నటుడు డాక్టర్ బ్రహ్మానందం సందడి చేశారు. మాజీ ఎంపీ టీజీ వెంకటేశ్‌తో కలిసి ఆయన ఓ టీ ప్రొడక్ట్ ఫ్రాంచైజీని ప్రారంభించారు. కర్నూలు ప్రజలు మంచివారని, మంచి సినిమాలను ఆదరించి విజయాన్ని అందిస్తారని బ్రహ్మానందం అన్నారు. ఆయనను చూడ్డానికి అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అనంతరం టీజీ వెంకటేశ్ నివాసానికి వెళ్లారు.

Similar News

News October 16, 2025

కర్నూలుకు వస్తున్నా.. తెలుగులో మోదీ ట్వీట్

image

ప్రధాని నరేంద్ర <<18018303>>మోదీ<<>> తన ఆంధ్రప్రదేశ్ పర్యటనపై ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించారు. నేడు శ్రీశైలంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివారిని దర్శించుకొని, అనంతరం కర్నూలులో రూ.13,400 కోట్ల విలువైన అభివృద్ధి పనుల శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమాలలో పాల్గొంటానని తెలిపారు. విద్యుత్, రైల్వేలు, పెట్రోలియం, రక్షణ, పరిశ్రమల వంటి పలు రంగాలకు సంబంధించిన ప్రాజెక్టులు ఈ పర్యటనలో భాగమని పేర్కొన్నారు.

News October 16, 2025

రూ.13,429 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు

image

కర్నూలు జిల్లాలో ప్రధాని మోదీ భారీ ఎత్తున ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాలను చేపట్టనున్నారు. మొత్తంగా రూ.13,429 కోట్ల మేర అభివృద్ధి పనులకు మోదీ శ్రీకారం చుట్టనున్నారు. వీటిల్లో రూ.9,449 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపనలు చేయనుండగా.. రూ.1,704 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. రూ.2,276 కోట్ల విలువైన ప్రాజెక్టులను జాతికి అంకితం చేస్తారు.

News October 15, 2025

ఇండస్ట్రీ పార్టనర్‌షిప్ డ్రైవ్ పోస్టర్లను ప్రారంభించిన మంత్రులు

image

కూటమి ప్రభుత్వంతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. కర్నూలులో బుధవారం ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఏపీ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్(APIIC) నిర్వహించిన ఇండస్ట్రీ పార్టనర్‌షిప్ డ్రైవ్ పోస్టర్లను రాష్ట్ర మంత్రులు ఆవిష్కరించారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, జిల్లా అధికారులు, పరిశ్రమల ప్రతినిధులు పాల్గొన్నారు.