News March 15, 2025
కర్నూలులో హత్య.. పాత కక్షలే కారణమా?

కర్నూలులో TDP నేత సంజన్న <<15763975>>హత్య<<>> కలకలం రేపింది. శరీన్‌నగర్‌లో ఉంటున్న సంజన్నకు స్థానికంగా అంజితో ఆధిపత్యపోరు ఉంది. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి ఇంటికి వెళ్తున్న సంజన్నపై దండగులు కత్తులతో దాడి చేసి హత్య చేశారు. విషయం తెలుసుకున్న సంజన్న వర్గీయులు ఆంజి వాహనంపై దాడికి పాల్పడటంతో ఉద్రిక్తత నెలకొంది. అంజి వర్గీయులే ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Similar News
News December 6, 2025
జగిత్యాల జిల్లా ఆర్ఎంపీ, పీఎంపీ అధ్యక్షునిగా కుసుమ శంకర్

జగిత్యాల జిల్లా ఆర్ఎంపీ, పీఎంపీ అసోసియేషన్ అధ్యక్షునిగా కుసుమ శంకర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జగిత్యాలలోని భాగ్యరాజ్ ఫంక్షన్ హాల్లో శనివారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికల్లో జిల్లా అధ్యక్షుడిగా పెగడపల్లికి చెందిన కుసుమ శంకర్ ఏకగ్రీవంగా ఎంపికయ్యాడు.
News December 6, 2025
దంపతులకు దత్తత ఫైనల్ ఆర్డర్ అందజేసిన కలెక్టర్

ఏలూరు కలెక్టర్ కార్యాలయంలో శనివారం ఫ్రీ అడాప్షన్ పోర్టల్ ద్వారా 8నెలల చరణ్ బాబుకు తుది దత్తత ఆర్డర్‌ను జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి అందజేశారు. మహబూబ్‌నగర్‌కు చెందిన దంపతులకు ఈబిడ్డను దత్తత ఇచ్చారు. బాబును చూసుకునే విధానం, పోషణ, ఇమ్యునైజేషన్ వంటి అంశాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత, దత్తత తీసుకున్న వారిని సొంత తల్లిదండ్రులుగా గుర్తించి ఫైనల్ ఆర్డర్ ఇచ్చినట్లు కలెక్టర్ తెలిపారు.
News December 6, 2025
HYD: 31st NIGHT.. లోడింగ్!

సెలబ్రేషన్ అంటే హైదరాబాదీ ముందుంటాడు. రిలాక్స్ కోసం ప్రతి వీకెండ్లో పబ్‌లు, టూరిస్ట్ ప్లేస్‌లకు వెళ్లే నగరవాసి ఏడాది చివరిరోజైన DEC 31ST నైట్ చేసే ప్లానింగ్ మామూలుగా ఉండదు. న్యూ ఇయర్‌కు ఇంకా 25 రోజుల సమయం ఉన్నా ఇప్పటి నుంచే ప్రిపేర్ అవుతున్నారు. సిటీలో స్పెషల్ ఈవెంట్స్ ఏమైనా చేస్తున్నారా? అని టికెట్స్ కోసం సెర్చ్ చేస్తున్నారు. కొందరేమో శివారులోని ఫామ్ హౌస్‌లకు ఓటేస్తున్నారు. మరి మీ ప్లాన్ ఏంటి?


