News November 20, 2024

కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ప్రక్రియ షురూ!

image

కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ఎన్నికల వేళ కూటమి నేతలు ఇచ్చిన హామీ మేరకు సీఎం కార్యాలయం నుంచి తాజాగా న్యాయశాఖకు ప్రభుత్వం లేఖ రాసింది. దీంతో ప్రక్రియను న్యాయశాఖ ప్రారంభించింది. కర్నూలులో బెంచ్ ఏర్పాటుకు సంబంధించి హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌కు న్యాయశాఖ కార్యదర్శి సునీత లేఖ రాశారు. రాయలసీమ జిల్లాలకు సంబంధించి హైకోర్టులో దాఖలైన కేసులు వివరాలు ఇవ్వాలని కోరారు.

Similar News

News November 21, 2024

ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయండి: కర్నూలు జిల్లా ఎమ్మెల్యేలు

image

కర్నూలు జిల్లాలోని నీటి ప్రాజెక్టుల నిర్మాణాలను త్వరగా పూర్తిచేయాలని సీఎం నారా చంద్రబాబునాయుడును జిల్లా ఎమ్మెల్యేలు కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టును వేగవంతంగా పూర్తి చేయాలని కోరినట్లు తెలిపారు. సాగు, తాగునీటి అవసరాలు తీర్చడానికి కట్టుబడి ఉన్నామని సీఎం హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు.

శ్రీశైలంలో సాంప్రదాయ బద్ధంగా ఆకాశదీపం పూజలు

image

ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన శ్రీశైల మహా క్షేత్రంలో గురువారం కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ఆకాశదీపం వెలిగించారు. కార్తీక మాసంలో ప్రతిరోజూ ఆలయంలో ఆకాశ దీపానికి వేద పండితులు పూజలు నిర్వహించి ధ్వజస్తంభానికి ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా అర్చకులు పూజ నిర్వహించి కార్తీకదీపం ఏర్పాటు చేశారు.