News January 27, 2025

కర్నూలులో 30న వైసీపీ జిల్లా కార్యవర్గ సమావేశం

image

వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నెల 30న గురువారం ఉదయం 10 గంటలకు కర్నూలులో శ్రీలక్ష్మి ఫంక్షన్ హాల్ (బిర్లా కాంపౌండ్)లో జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహిస్తున్నట్లు జిల్లా వైసీపీ అధ్యక్షుడు ఎస్‌వీ మోహన్ రెడ్డి తెలిపారు. ఈ సమావేశానికి జిల్లా వైసీపీ కమిటీ సభ్యులు, అనుబంధ కమిటీల సభ్యులు తప్పక హాజరు కావాలని పిలుపునిచ్చారు. పార్టీ అభివృద్ధిపై చర్చిస్తామని తెలిపారు.

Similar News

News February 17, 2025

కర్నూలులో 38°C ఉష్ణోగ్రత

image

కర్నూలు జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. వరుసగా రెండో రోజు కర్నూలులో 38°C ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలో ఇదే అత్యధికం. జిల్లాలోని మిగతా మండలాల్లోనూ 35 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదైంది. ఫిబ్రవరిలోనే ఇలా ఉంటే రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. మరోవైపు నంద్యాలలో 37°C ఉష్ణోగ్రత నమోదైంది.

News February 17, 2025

కర్నూల్‌లో 38.2 డిగ్రీల ఉష్ణోగ్రత

image

కర్నూలులో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఆదివారం దేశంలోనే అత్యధికంగా కర్నూలులో 38.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ నెలలో ఇంత ఉష్ణోగ్రత నమోదవడం ఇది రెండోసారి. జిల్లాలోని మిగతా మండలాల్లోనూ 35 డిగ్రీలకు పైగా నమోదైంది. ఫిబ్రవరిలోనే ఇలా ఉంటే రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.

News February 17, 2025

కర్నూలు: మద్యం మత్తులో తండ్రిని చంపాడు

image

మద్యం మత్తులో తండ్రిని కొడుకు హత్య చేసిన ఘటన కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం నన్నూరులో ఆదివారం జరిగింది. నన్నూరుకు చెందిన నారాయణ, అతడి పెద్దకొడుకు నవీన్ ఇద్దరు కలిసి మద్యం తాగారు. ఆ తర్వాత మద్యం మత్తులో గొడవకు దిగారు. మాటామాటా పెరిగడంతో నవీన్ కోపంతో కర్రతో నారాయణ తలపై కొట్టడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై సునీల్ తెలిపారు.

error: Content is protected !!