News December 31, 2024
కర్నూలు: ‘అక్రమ కేసులు బనాయించడం సరికాదు’

వెల్దుర్తి మండలం బొమ్మిడి పల్లిలో జరిగిన హత్య కేసులో ఏ సంబంధం లేని వారిపై అక్రమ కేసులు బనాయించడం సరికాదని పాణ్యం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఆయన పలువురు వైసీపీ ముఖ్య నాయకులతో కలిసి కర్నూలు ఎస్పీ బిందు మాధవ్ను కలిశారు. కేవలం వైసీపీ సానుభూతిపరులన్న ఉద్దేశంతో హత్య ఘటనలో ఏమాత్రం సంబంధం లేని వ్యక్తులను ఇరికించడం సరికాదన్నారు.
Similar News
News October 17, 2025
జనసేన అభిమాని అర్జున్ మృతిపై లోకేశ్ దిగ్భ్రాంతి

కర్నూలులో నిన్న జరిగిన జీఎస్టీ సభలో విద్యుత్ షాక్ తగిలి జనసేన అభిమాని అర్జున్ (15) మృతిపై మంత్రి నారా లోకేశ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అతడి మృతి తనను కలచివేసిందని పేర్కొన్నారు. అర్జున్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని తెలిపారు. మరోవైపు మృతుడి కుటుంబానికి విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ రూ.5 లక్షల పరిహారం ప్రకటించారు. అర్జున్ కర్నూలు మండలం మునగాలపాడు గ్రామానికి చెందిన వారు.
News October 16, 2025
కర్నూలులో మొట్టమొదటి ఈ-కోర్ట్ ప్రారంభం

రెండు తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటిగా కర్నూలులో ఈ-కోర్ట్ ఏర్పాటు చేశారు. దీనిని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వీసీ డా.పి.చంద్రశేఖర్ గురువారం ప్రారంభించారు. వైద్యులు, సిబ్బంది ఇక్కడి నుండే రాష్ట్రంలో ఏ కోర్టుకైనా సాక్ష్యాన్ని అందించవచ్చని చెప్పారు. దీని ద్వారా సమయం, డబ్బు ఆదా అవుతుందని తెలిపారు.
News October 16, 2025
కర్నూలుకు వస్తున్నా.. తెలుగులో మోదీ ట్వీట్

ప్రధాని నరేంద్ర <<18018303>>మోదీ<<>> తన ఆంధ్రప్రదేశ్ పర్యటనపై ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించారు. నేడు శ్రీశైలంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివారిని దర్శించుకొని, అనంతరం కర్నూలులో రూ.13,400 కోట్ల విలువైన అభివృద్ధి పనుల శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమాలలో పాల్గొంటానని తెలిపారు. విద్యుత్, రైల్వేలు, పెట్రోలియం, రక్షణ, పరిశ్రమల వంటి పలు రంగాలకు సంబంధించిన ప్రాజెక్టులు ఈ పర్యటనలో భాగమని పేర్కొన్నారు.