News February 16, 2025
కర్నూలు, ఆదోనిలో ఎండు మిర్చి ధరల వివరాలు

కర్నూలు, ఆదోని వ్యవసాయ మార్కెట్లలో శనివారం ఎండు మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నాయి. ఆదోని వ్యవసాయ మార్కెట్లో క్వింటా గరిష్ఠ ధర రూ.13,236 పలకగా.. కనిష్ఠ ధర రూ.2,200 పలికింది. కర్నూల్లో కనిష్ఠంగా రూ.3,500 పలకగా.. గరిష్టంగా రూ.12,813 పలికినట్లు ఆయా మార్కెట్ల ఎంపిక శ్రేణి అధికారులు తెలిపారు.
Similar News
News December 20, 2025
కర్నూలు: మిరప పంటలో గంజాయి సాగు

చిప్పగిరి మండలం దేగులపాడు గ్రామ పరిధిలో మిరప పంటలో అంతర పంటగా గంజాయి సాగు చేసినట్లు పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. పొలాన్ని తనిఖీ చేసి గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. దీనిపై పూర్తిస్థాయి దర్యాప్తు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News December 20, 2025
నూతన ఆలోచనలతో అద్భుతాలు సృష్టించాలి: కలెక్టర్

నూతన ఆలోచనలతో విద్యార్థులు అద్భుతాలు సృష్టించాలని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి అన్నారు. శనివారం కర్నూలు ప్రభుత్వ టౌన్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన జిల్లాస్థాయి విద్య, వైజ్ఞానిక ప్రదర్శనలను డీఈవో సుధాకర్, ఏపీసీ లోకరాజుతో కలిసి ఆమె ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థులు తమ ఆలోచనలకు పదును పెట్టి నమూనాలను రూపొందించాలన్నారు.
News December 20, 2025
క్రిస్మస్, న్యూ ఇయర్.. కర్నూలు ఎస్పీ హెచ్చరిక

క్రిస్మస్, న్యూ ఇయర్ గిఫ్ట్ పేరుతో సోషల్ మీడియాలో వస్తున్న అనుమానాస్పద లింకులను క్లిక్ చేయవద్దని SP విక్రాంత్ పాటిల్ ప్రజలను హెచ్చరించారు. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్, టెలిగ్రామ్ ద్వారా వచ్చే గిఫ్ట్ కార్డు లింకులతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు. వ్యక్తిగత సమాచారం, బ్యాంక్ వివరాలు ఎట్టి పరిస్థితుల్లోనూ పంచుకోవద్దన్నారు. మోసానికి గురైతే 1930, 100, 102కు కాల్ చేయాలన్నారు.


