News June 15, 2024

కర్నూలు ఆర్‌యూ స్నాతకోత్సవం వాయిదా

image

కర్నూలు రాయలసీమ విశ్వవిద్యాలయం నాలుగో స్నాతకోత్సవం పలు కారణాలతో వాయిదా పడింది. ఈ మేరకు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్‌లర్ సుధీర్ ప్రేమ్‌కుమార్ శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ విషయాన్ని కాన్వకేషన్‌కు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు గమనించాలని కోరారు.

Similar News

News October 13, 2025

మంత్రాలయంలో 727 టీచర్ పోస్టులు భర్తీ

image

మంత్రాలయం నియోజకవర్గానికి అత్యధికంగా 727 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడం హర్షనీయమని టీడీపీ ఇన్‌ఛార్జ్ రాఘవేంద్రరెడ్డి తెలిపారు. ఆదివారం మంత్రాలయం మండలం మాధవరంలో ఆయన మాట్లాడారు. మెగా డీఎస్సీ ద్వారా తన నియోజకవర్గంలో ఎక్కువ ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయడంపై మంత్రి లోకేశ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. మంత్రాలయంలో 121, పెద్దకడబూరులో 92, కోసిగిలో 256, కౌతాళంలో 257 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడం జరిగిందన్నారు.

News October 13, 2025

ప్రధాని పర్యటన ఏర్పాట్లు పకడ్బందీగా జరగాలి: CM

image

ప్రధాని నరేంద్ర మోదీ జిల్లా పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు ఎటువంటి లోపం లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని CM చంద్రబాబు నాయుడు జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. ఆదివారం విజయవాడ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఏర్పాట్లపై సీఎం సమీక్ష నిర్వహించారు. కర్నూలు నుంచి స్పెషల్‌ ఆఫీసర్‌ వీర పాండేన్‌, జిల్లా కలెక్టర్‌ ఎ.సిరి, ఎస్పీ విక్రాంత్‌ పాల్గొని వివిధ అంశాలపై చర్చించారు.

News October 12, 2025

కర్నూలు: రేపు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక రద్దు

image

భారత ప్రధాని కర్నూలు పర్యటన నేపథ్యంలో మున్సిపల్ అధికార యంత్రాంగం ఏర్పాట్లలో ఉన్నందున సోమవారం నిర్వహించాల్సిన ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’ను రద్దుచేసినట్లు నగరపాలక కమిషనర్ విశ్వనాధ్ ఆదివారం వెల్లడించారు. నగర ప్రజలు తమ కాలనీల సమస్యలకు సంబంధించి పరిష్కారం కోసం హెల్ప్‌లైన్ నంబర్ 7422992299కు ఫిర్యాదు చేయాలని తెలిపారు.