News May 21, 2024
కర్నూలు: ఆ ఇద్దరి మహిళది హత్యే
కర్నూలు గార్గేయపురం నగరవరం చెరువులో మహిళల మృతదేహాలు బయటపడిన సంగంతి తెలిసిందే. ఇద్దరు మహిళలో ఒకరు మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన జానకిగా, మరొకరు అరుణగా గుర్తించారు. పోలీసుల దర్యాప్తులో కర్నూలుకు చెందిన ఆటోడ్రైవర్‌తో అరుణ గొడవపడి కొట్టించినట్లు తెలిసి అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతడు కక్షగట్టి నమ్మించి వారిని చెరువు వద్దకు తీసుకెళ్లి నీళ్లలోకి తోసి హత్యచేసినట్లు విచారణలో తెలింది.
Similar News
News December 8, 2024
వెల్దుర్తిలో స్నేహితుల ఆర్థిక సాయం అందజేత
వెల్దుర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1988 – 89 సంవత్సరంలో పదవ తరగతి విద్యను అభ్యసించిన మిత్రులందరికీ కొన్ని రోజుల క్రితం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఆ కార్యక్రమంలో తోటి మిత్రురాలు తంబల రాజేశ్వరికి రెండు కిడ్నీలు చెడిపోయి అనారోగ్యంతో ఉన్న విషయాన్ని తోటి స్నేహితులు తెలుసుకున్నారు. ఈ మేరకు వారు రూ.20 వేల నగదును సేకరించి ఆదివారం ఆమెకు అందించారు. అనంతరం ఆమె త్వరగా కోలుకోవాలని వారు ప్రార్థించారు.
News December 8, 2024
బేతంచర్లలో ఇరు వర్గాల హిజ్రాల మధ్య ఘర్షణ
బేతంచెర్లలోని కొత్త బస్టాండు సమీపంలో ఆదివారం హిజ్రా వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. నంద్యాలకు చెందిన హిజ్రాల వర్గం బేతంచర్లకు వచ్చి డబ్బువసూలు చేయకూడదని స్థానికులు వాగ్వాదానికి దిగారు. స్థానికుల సమాచారంతో బేతంచర్ల ఎస్సై రమేశ్ బాబు ఘటనా స్థలానికి చేరుకొని ఇరువర్గాలను చెదరగొట్టారు. దీంతో ఘర్షణ సద్దుమణిగింది.
News December 8, 2024
బనగానపల్లెలో టీచర్‌పై కేసు
ఓ ప్రైవేటు పాఠశాల టీచర్‌ను తల్లిదండ్రులు చితకబాది పోలీసులకు అప్పగించిన ఘటన బనగానపల్లెలో శనివారం జరిగింది. మ్యాథ్స్ టీచర్ ధృవకుమార్ విద్యార్థులకు మార్కులు ఎక్కువ వేస్తానని ఓ విద్యార్థిని వద్ద డబ్బు వసూలు చేసినట్లు యాజమాన్యం ఫిర్యాదు మేరకు కేసు నమోదైనట్లు ఎస్సై తెలిపారు. అయితే దాంతో పాటు విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించాడని తెలిసి పేరెంట్స్ చితకబాది పోలీసులకు అప్పగించినట్లు సమాచారం.