News May 26, 2024

కర్నూలు: ఇంటర్ సప్లమెంటరీ పరీక్షల్లో ఇద్దరు డీబార్

image

ఇంటర్మీడియట్ సప్లమెంటరీ శనివారం రెండో రోజు జరిగిన పరీక్షలో కర్నూలులో ఇద్దరు విద్యార్థులు మాస్ కాపీయింగ్‌కు పాల్పడుతుండగా డీబార్ చేశారు. ఉదయం ప్రథమ సంవత్సరం పరీక్షలకు 8,970 మంది విద్యార్థులు హాజరు కాగా.. 315 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని ఆర్ఓ ఎస్విఎస్ గురువయ్య శెట్టి వెల్లడించారు. మధ్యాహ్నం ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 830 మంది విద్యార్థులు హాజరు కాగా 76 మంది గైర్హాజరయ్యారు.

Similar News

News February 13, 2025

ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ హాకీ పోటీలకు జిల్లా క్రీడాకారులు

image

ఈనెల 15 నుంచి 28వ తేదీ కాకినాడలో జరుగుతున్న ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ హాకీ పోటీలకు నర్సాపురం సచివాలయం అనిమల్ హస్బెండ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న రసూల్ ఖాన్, కొంగనపాడు సచివాలయం అనిమల్ హస్బెండ్ అసిస్టెంట్ మహేశ్ ఎంపికయ్యారు. గురువారం కర్నూలు కలెక్టరేట్లోని పశుసంవర్ధక శాఖ జేడీ శ్రీనివాసులు, కల్లూరు ఏవీహెచ్ అడిషనల్ డైరెక్టర్ పార్థసారథి ప్రత్యేకంగా అభినందించారు.

News February 13, 2025

కర్నూలు జిల్లాకు ‘దామోదరం’ పేరు పెట్టాలి: వీహెచ్

image

కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు కర్నూలు జిల్లాకు దామోదరం సంజీవయ్య పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. ఏపీకి రెండో సీఎంగా ఆయన సేవలు అందించారని, తొలి దళిత ముఖ్యమంత్రి కూడా ఆయనే అని తెలిపారు. ఆయన సేవలను గుర్తించి జిల్లాకు దామోదరం పేరు పెట్టాలని సీఎం చంద్రబాబు నాయుడును కోరారు. కాగా సంజీవయ్య జిల్లాలోని కల్లూరు మండలం పెద్దపాడులో మునెయ్య, సుంకులమ్మ దంపతులకు 1921లో జన్మించిన విషయం తెలిసిందే.

News February 13, 2025

‘భీముని కొలను’ గురించి తెలుసా?

image

పూర్వం పాండవులు శ్రీశైలం నల్లమల అడవుల్లో తీర్థయాత్రలు చేస్తుండగా ద్రౌపది దాహం తీర్చుకున్న కొలనే భీముని కొలనుగా ప్రసిద్ధి చెందింది. ద్రౌపది దాహంగా ఉందని చెప్పడంతో భీముడు చుట్టుపక్కల వెతికారని చరిత్ర చెబుతోంది. దాలోమశ మహర్షి ఒక శిలను చూపించి, పగులగొట్టమని చెప్పడంతో గదతో ఆ శిలను భీముడు పగులగొట్టగా నీటి ధారలు దూకాయట. భీముని కారణంగా ఏర్పడిన కొలను కావడంతో ‘భీముని కొలను‘ అనే పేరు వచ్చిందని అంటారు.

error: Content is protected !!