News August 8, 2024
కర్నూలు: ఇండికేటర్స్ లో పురోగతి సాధించాలి
ఆస్పిరేషనల్ జిల్లా/బ్లాకులకు సంబంధించిన ఇండికేటర్స్‌లో సెప్టెంబరు 30వ తేదిలోపు పురోగతి సాధించాలని నీతి అయోగ్ సీఈఓ బివిఆర్.సుబ్రహ్మణ్యం అన్ని రాష్ట్రాల జిల్లా కలెక్టర్లకు సూచించారు. గురువారం ఢిల్లీ నీతి అయోగ్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని రాష్ట్రాల కలెక్టర్లతో వివిధ అంశాలపై నీతి అయోగ్ సీఈఓ సమీక్ష నిర్వహించారు. కర్నూల్ కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా పాల్గొన్నారు.
Similar News
News September 10, 2024
నంద్యాలలో 10న దిశా కమిటీ సమావేశం
ఈ నెల 10వ తేదీ దిశా కమిటీ (కేంద్ర ప్రభుత్వ పథకాలు, నిధులు, అభివృద్ధిపై సమీక్ష) సమావేశం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్, కన్వీనర్ జి.రాజకుమారి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. కలెక్టరేట్‌లోని సెంటినరీ హాల్లో సోమవారం ఉ.10 గంటలకు ఎంపీ బైరెడ్డి శబరి అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుందన్నారు. జిల్లా మంత్రులు, జిల్లా పరిషత్ ఛైర పర్సన్, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు పాల్గొంటారని తెలిపారు.
News September 9, 2024
శ్రీశైలం: గణపయ్యకు 130 రకాల ప్రసాదాలు నైవేద్యం
శ్రీశైలం ప్రాజెక్టు కాలనీలో వినాయక చవితి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఆయా గణేశ్ ఉత్సవ కమిటీల ఆధ్వర్యంలో ప్రత్యేకంగా అలంకరించిన అలంకారం మండపంలో కొలువుతీరిన గణనాథులకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. సోమవారం పలుచోట్ల అన్నదాన కార్యక్రమాలను చేపట్టారు. కొత్త బజార్లోని శ్రీ లక్ష్మీ గణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో బొజ్జా గణపయ్యకు 130 రకాల ప్రసాదాలను నైవేద్యంగా సమర్పించారు.
News September 9, 2024
ప్రభుత్వం అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళ్తోంది: మంత్రి ఫరూక్
ప్రభుత్వం అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళ్తోందని నంద్యాల ఎమ్మెల్యే, మంత్రి ఫరూక్ తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నవ్యాంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం లక్ష్యంగా పనిచేస్తోందన్నారు. వృద్ధాప్య పింఛన్ రూ.4 వేలకు పెంచడం, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, పోలవరం నిర్మాణం, పకృతి విపత్తుల సమర్ధ నిర్వహణపై దృష్టి సారించామని అన్నారు.