News February 6, 2025
కర్నూలు: ఈ దరఖాస్తులకు రేపే చివరి తేది

స్వయం ఉపాధిని కల్పించేందుకు ప్రభత్వం కార్పొరేషన్ల ద్వారా రుణాలు మంజూరు చేస్తోంది. ఈ మేరకు బీసీ, ఈబీసీ వర్గాల వారికి బీసీ కార్పొరేషన్ ద్వారా రుణాలు అందించేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అందుకు ఈ నెల 7వ తేదీ వరకు అవకాశం కల్పించింది. లబ్ధిదారులు https://apobmms.apcfss.in/ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని బీసీ కార్పొరేషన్ ఈడీ జాకీర్ హుస్సేన్ తెలిపారు.
Similar News
News October 18, 2025
కండ్లపల్లి చెరువు కట్ట పరిశీలన.. డ్యామ్ సేఫ్టీ అధికారుల తనిఖీ

జగిత్యాల శివారులోని కండ్లపల్లి చెరువు కట్ట ఇటీవల కుంగిపోయి ప్రమాదకరంగా మారిన నేపథ్యంలో డ్యామ్ సేఫ్టీ అధికారులు శుక్రవారం కట్టను పరిశీలించారు. చెరువు కట్ట మరమ్మతులకు సంబంధించి తక్షణం చేపట్టవలసిన పనులను సంబంధిత నీటిపారుదల శాఖ అధికారులకు వారు సూచించారు. ఈ తనిఖీలో విశ్రాంత ఎన్సీ రామరాజు, సేఫ్టీ అధికారిణి విజయలక్ష్మి, నీటిపారుదల శాఖ ఈఈ ఖాన్, జియాలజిస్ట్ పద్మరాజు పాల్గొన్నారు.
News October 18, 2025
జగిత్యాల: ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష

జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ శుక్రవారం కలెక్టరేట్లో ధాన్యం కొనుగోలు ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు కోసం కేంద్రాల్లో టార్ఫాలిన్, వెయింగ్, తేమ యంత్రాలు, ప్యాడీ క్లీనర్లు సిద్ధం చేయాలని, సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని, కొనుగోలు వెంటనే ట్యాబ్ ఎంట్రీ, నగదు/బోనస్ ఖాతాల్లో జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
News October 18, 2025
కోరుట్ల: జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవికి దరఖాస్తు చేసిన జువ్వాడి

జగిత్యాల జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవికి కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు శుక్రవారం దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ పరిశీలకులు, జగిత్యాల జిల్లా ఇన్చార్జ్ జై కుమార్కు దరఖాస్తును అందజేశారు. అనంతరం మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మాజీమంత్రి జీవన్ రెడ్డి, ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్ తదితరులను ఆయన సన్మానించారు.