News February 6, 2025
కర్నూలు: ఈ దరఖాస్తులకు రేపే చివరి తేది

స్వయం ఉపాధిని కల్పించేందుకు ప్రభత్వం కార్పొరేషన్ల ద్వారా రుణాలు మంజూరు చేస్తోంది. ఈ మేరకు బీసీ, ఈబీసీ వర్గాల వారికి బీసీ కార్పొరేషన్ ద్వారా రుణాలు అందించేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అందుకు ఈ నెల 7వ తేదీ వరకు అవకాశం కల్పించింది. లబ్ధిదారులు https://apobmms.apcfss.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని బీసీ కార్పొరేషన్ ఈడీ జాకీర్ హుస్సేన్ తెలిపారు.
Similar News
News February 7, 2026
నెల్లూరు: రైలు ఢీకొని మహిళ స్పాట్ డెడ్

మనుబోలు రైల్వే స్టేషన్ ఉత్తరం వైపు ఫ్లాట్ ఫామ్ చివరన చెన్నై నుంచి విజయవాడ వెళ్లే లైన్‌లో గుర్తుతెలియని మహిళ పట్టాలు దాటే క్రమంలో ప్రమాదవశాత్తు రైలు ఢీకొని శనివారం సాయంత్రం మృతి చెందింది. వయస్సు సుమారు 50-55 ఏళ్లు ఉండొచ్చని, 5.0అడుగుల ఎత్తు కలిగి చాయా రంగు కలిగి ఉందని రైల్వే ఎస్సై హరి చందన తెలిపారు. మృతురాలు సిమెంట్ రంగుపై బులుగు రంగు సిల్క్ చీర, ఆకుపచ్చ పావడాను ధరించి ఉందని అన్నారు.
News February 7, 2026
పెద్దపల్లి: విజయవంతంగా ఉపాధి అవగాహన కార్యక్రమం

పెద్దపల్లి టాస్క్ రీజియన్ సెంటర్లో శనివారం జిల్లాస్థాయి ఉపాధి అవగాహన, బ్యాంకింగ్ అవేర్నెస్ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించినట్లు జిల్లా ఉపాధి అధికారి రాజశేఖర్ తెలిపారు. ఉపాధి అవకాశాలు, కెరీర్ ప్రణాళిక, పోటీ పరీక్షలపై మార్గ నిర్దేశం చేసినట్లు పేర్కొన్నారు. ఇండియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో బ్యాంకింగ్ అవగాహన కార్యక్రమం చేపట్టినట్లు వివరించారు. టాస్క్ మేనేజర్ గంగా ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.
News February 7, 2026
ఉప్పల్‌లో రేపు మెగా సెమినార్

బాల్యం తర్వాత కొత్త జీవితంలోకి తొలి అడుగు వేసేది 10th క్లాస్ తర్వాతే. అలాంటి కీలకమైన దశలో స్టూడెంట్స్‌తోపాటు వారి తల్లిదండ్రులు ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకునేలా Way2News& Resonance సంస్థ సంయుక్తంగా ఉచిత అవగాహన సదస్సు నిర్వహిస్తున్నాయి. ఉప్పల్ భగాయత్‌లోని SriRasthu Conventionలో రేపు ఉదయం 10:30 గంటలకు జరిగే ఈ సదస్సులో CBI EX జేడీ లక్ష్మీనారాయణ పాల్గొని మార్గనిర్దేశం చేయనున్నారు


