News September 3, 2024
కర్నూలు: ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ 7న బంద్

తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ ప్రభుత్వ వైన్ షాప్ ఉద్యోగులు 7న బంద్కు పిలుపు ఇస్తూ రాష్ట్ర యూనియన్ నిర్ణయం తీసుకుంది. సోమవారం జిల్లా కమిటీ ఉపాధ్యక్షుడు మనోహర్ రెడ్డి, రాష్ట్ర జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ జతిన్ రెడ్డి, అడ్వైసర్ నాగచంద్రు కలిసి జిల్లా మద్యం డిపో అధికారులకు బంద్ నోటీసులు ఇచ్చారు. తమకు మరో శాఖలో ఉపాధి కల్పించాలని కోరుతున్నామన్నారు.
Similar News
News November 9, 2025
కర్నూలులో బీటెక్ విద్యార్థి ఆత్మహత్య

కర్నూలులోని నిర్మల్ నగర్లో ఆదివారం విషాదం నెలకొంది. కాలనీకి చెందిన భరత్ కుమార్(21) ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతడు బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. దీనిపై ఎటువంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. అయితే సెమిస్టర్ పరీక్షలు రానున్నాయనే భయంతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.
News November 9, 2025
ఈనెల 11న సీఎం వర్చువల్ శంకుస్థాపనలు: కలెక్టర్

జిల్లాలో పలు ప్రాజెక్టులకు ఈ నెల 11న సీఎం చంద్రబాబు వర్చువల్గా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఇందుకు తగిన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ డా. ఏ. సిరి అధికారులను ఆదేశించారు. ఆదివారం ఆర్డీవోలు, ఏపీఐఐసీ, ఎయిర్పోర్ట్, టూరిజం అధికారులతో కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ముఖ్యమంత్రి లబ్ధిదారులు, స్టేక్హోల్డర్లతో నేరుగా మాట్లాడే అవకాశం ఉండేలా సక్రమ ఏర్పాట్లు చేయాలని సూచించారు.
News November 9, 2025
కర్నూలు జిల్లా విశ్వబ్రాహ్మణ మహిళా అధ్యక్షురాలిగా పద్మావతి

విశ్వబ్రాహ్మణ హక్కుల పోరాట సమితి కర్నూలు జిల్లా మహిళా అధ్యక్షురాలిగా ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన పద్మావతి నియమితులయ్యారు. ఆదివారం పత్తికొండ పట్టణంలో విశ్వబ్రాహ్మణ హక్కుల పోరాట సమితి సమావేశం జరిగింది. ఇందులో విశ్వబ్రాహ్మణ హక్కుల పోరాట సమితి కర్నూలు జిల్లా మహిళా అధ్యక్షురాలిగా పద్మావతిని నియమిస్తూ నియామక పత్రాన్ని అందజేశారు. తనను ఎన్నుకున్న ప్రతి ఒక్కరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.


