News July 12, 2024
కర్నూలు: ఉద్యోగ మేళాలో 37 మంది ఎంపిక

నిరుద్యోగ యువత ప్రైవేట్ రంగంలో అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కర్నూలు జిల్లా ఉపాధి కల్పనాధికారిణి దీప్తి పేర్కొన్నారు. గురువారం ఉపాధి కల్పనా కార్యాలయంలో ఉద్యోగ మేళా నిర్వహించారు. అనంత ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, శ్రీరామ్ చిట్స్, లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు. మేళాకు 74 మంది హాజరు కాగా.. అందులో 37 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారని తెలిపారు.
Similar News
News March 16, 2025
ఆదోనిలో ‘గరివిడి లక్ష్మి’ సినిమా షూటింగ్

ఆదోనిలోని ఒకటో వార్డు చిన్నశక్తి గుడి ఆవరణలో శనివారం అర్ధరాత్రి నుంచి తెల్లవారుజామున వరకు ‘గరివిడి లక్ష్మి’ సినిమా షూటింగ్ జరిగింది. షూటింగ్‌ను తిలకించడానికి జనాలు ఎగబడ్డారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఒకటో పట్టణ పోలీసులు బందోబస్తు కల్పించారు. గౌరీ నాయుడు జమ్ము దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి జే.ఆదిత్య కెమెరామెన్ కాగా, చరణ్ అర్జున్ సంగీతం అందిస్తున్నారు.
News March 16, 2025
పొట్టి శ్రీరాములు జీవిత చరిత్ర అనుసరణీయం: మంత్రి టీజీ భరత్

రాష్ట్ర సాధన కోసం కఠోర దీక్ష చేసి తెలుగు జాతికి స్ఫూర్తిగా నిలిచిన అమరజీవి పొట్టి శ్రీరాములు జీవిత చరిత్ర నేటి యువత అనుసరించాలని మంత్రి టీజీ భరత్ అన్నారు. పొట్టి శ్రీరాములు 124వ జయంతి పురస్కరించుకొని కర్నూలులోని పూల బజార్ వద్ద ఉన్న ఆయన కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 58 రోజుల పాటు నిర్విరామంగా అమరణ నిరాహార దీక్ష చేసి రాష్ట్రాన్ని సాధించారని అన్నారు.
News March 16, 2025
కర్నూలు జిల్లాలో చికెన్ ధరలు

కర్నూలు జిల్లాలో చికెన్ ధరలు ఆదివారం ఈ విధంగా ఉన్నాయి. కర్నూలు, ఎమ్మిగనూరులో కిలో స్కిన్ రూ.160, స్కిన్ లెస్ రూ.180కి అమ్ముతున్నారు. ఆదోనిలో స్కిన్ లెస్ రూ.185, స్కిన్ రూ.160కి విక్రయాలు జరిగుతున్నాయి. మిగిలిన పట్టణాల్లోనూ ఇవే రేట్లు పలుకుతున్నాయి.