News March 17, 2025
కర్నూలు: ఉరి వేసుకొని వ్యక్తి మృతి

కర్నూలు జిల్లా మంత్రాలయం మండల కేంద్రంలో ఆదివారం గుర్తు తెలియని ఓ వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గ్రామ శివారులోని మెలిగుట్ట దగ్గర ఓ చెట్టుకు ఉరి వేసుకున్నాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. శరీరం గుర్తుపట్టని విధంగా ఉంది. మృతుని ఆచూకీ తెలిసినవారు ఎస్ఐ 9121101152కి సంప్రదించాలని సూచించారు.
Similar News
News March 18, 2025
BREAKING: కర్నూలు జిల్లాలో 11 మంది SIల బదిలీ

☛ బాల నరసింహులు హొళగుంద నుంచి కర్నూలు త్రీటౌన్
☛ హనుమంత రెడ్డి VR TO కోసిగి
☛ చంద్రమోహన్ కోసిగి TO కర్నూలు 3టౌన్
☛ కేశవ కొత్తపల్లి TO నందవరం
☛ శ్రీనివాసులు నందవరం TO DCRB కర్నూలు
☛ రమేశ్ బాబు VR TO కర్నూలు 1టౌన్
☛ మన్మథ విజయ్ కర్నూలు 3టౌన్ TO ఆస్పరి
☛ మల్లికార్జున DSO నుంచి జొన్నగిరి
☛ జయశేఖర్ జొన్నగిరి నుంచి ఆదోని 3టౌన్
☛ దిలీప్ కుమార్ ఆలూరు నుంచి హోళగుంద
☛ మహబూబ్ బాషా హోళగుంద నుంచి ఆలూరు
News March 18, 2025
కోడుమూరులో వైఎస్ఆర్ విగ్రహానికి నిప్పు

కోడుమూరులోని కర్నూలు రహదారిలో ఉన్న మాజీ సీఎం, దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి మంగళవారం గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టారు. విగ్రహం తలపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టినట్లు తెలుస్తోంది. సమాచారం తెలుసుకున్న కర్నూలు జిల్లా వైసీపీ ప్రధాన కార్యదర్శి ఎం.ప్రభాకర్, మండల కన్వీనర్ రమేశ్ నాయుడు, కృష్ణారెడ్డి దగ్ధమైన వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని పరిశీలించారు.
News March 18, 2025
పోసాని మోసం చేశాడంటూ కర్నూలు వ్యక్తి ఫిర్యాదు

నటుడు పోసాని కృష్ణ మురళిని కేసులు వెంటాడుతున్నాయి. ఈ క్రమంలో కర్నూలు జిల్లాకు చెందిన సత్యనారాయణ అనే వ్యక్తి పోసాని తనను మోసం చేశాడంటూ తాజాగా టీడీపీ గ్రీవెన్స్లో ఫిర్యాదు చేశారు. ఉద్యోగం ఇప్పిస్తామని రూ.9లక్షలు తీసుకుని మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై హైదరాబాద్లోని గచ్చిబౌలి పీఎస్లో ఫిర్యాదు చేయగా ఎలాంటి చర్యలు చేపట్టలేదని తెలిపారు. తననకు న్యాయం చేయాలని కోరారు.