News June 13, 2024

కర్నూలు ఎంపీ MPTCగా రాజీనామా

image

తన MPTC పదవికి కర్నూలు ఎంపీ బస్తిపాడు నాగరాజు గురువారం రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని జిల్లా పరిషత్ సీఈఓ నర్సారెడ్డికి ఆయన అందజేశారు. 2021లో కర్నూలు మండలంలోని పంచలింగాల నుంచి MPTCగా టీడీపీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2024లో MPగా టీడీపీ నుంచి పోటీ చేసి వైసీపీ అభ్యర్థి రామయ్యపై గెలుపొందారు. దీంతో ఇప్పుడు MPగా ఉండటంతో MPTC పదవికి రాజీనామా చేసినట్లు ఆయన తెలిపారు.

Similar News

News September 17, 2024

మొక్క నాటిన డ్వామా పీడీ

image

‘ఏక్ పేడ్ మాకే నామ్’లో భాగంగా జిల్లా డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్‌ రామచంద్రా రెడ్డి చాగలమర్రిలోని మండల పరిషత్‌ కార్యాలయం ఆవరణంలో మొక్క నాటారు. ఆయన మాట్లాడుతూ.. అమ్మ పేరుతో మొక్క నాటాలని, చెట్లు పెంచాలన్న ప్రధాని పిలుపు మేరకు మొక్కలు నాటుతున్నామన్నారు. నవమాసాలు మోసి పెంచిన అమ్మకు గుర్తుగా చెట్టు నాటాలన్నారు. కార్యక్రమంలో ఏపీఓ నిర్మల, ఉపాధి సిబ్బంది పాల్గొన్నారు.

News September 17, 2024

పేదింటి రైతు బిడ్డకు ఎంబీబీఎస్ సీటు

image

క్రిష్ణగిరి మండలం కంబాలపాడుకు చెందిన దూదేకుల రంజిత్ కర్నూలు మెడికల్ కాలేజీలో సీటు సాధించాడు. తల్లిదండ్రులు రెహమాన్, మహబూబ్ బీ వ్యవసాయం చేసుకుంటూ జీవినం సాగిస్తున్నారు. తన కుమారుడు రంజిత్ నీట్‌లో 582/720 మార్కులు సాధించి మొదట విడత కౌన్సెలింగ్‌లోనే సీటు సాధించాడని ఆనందం వ్యక్తం చేశారు. రంజిత్‌ను పలువురు అభినందించారు.

News September 17, 2024

ఆళ్లగడ్డలో ఒకే కాన్పులో ముగ్గురు పిల్లల జననం

image

ఆళ్లగడ్డలో ఒకే కాన్పులో ముగ్గురు శిశువులు జన్మించారు. పట్టణానికి చెందిన ఆవుల స్వప్న అనే గర్భిణి పురిటి నొప్పులతో ఇవాళ ఉదయం డా.వెంకట సుబ్బారెడ్డి ఆసుపత్రిలో (శివమ్మ ఆసుపత్రి)లో చేరారు. డా.హనీషా, డా.యశ్వంత్ రెడ్డితో కూడిన వైద్యుల బృందం ఆమెకు నార్మల్ డెలివరీ ద్వారా కాన్పు చేయగా ముగ్గురు శిశువులు జన్మించారు. వారిలో ఇద్దరు మగ, ఒక ఆడ శిశువు ఉన్నారు. తల్లీ బిడ్డలు ఆరోగ్యంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు.